రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు కొత్తగా మంజూరైన పింఛన్లు పంపిణీ

నంద్యాల జిల్లా: ప్యాపిలి : ఆగస్టు 02 (ప్రజా నేత్ర న్యూస్): ప్యాపిలి పట్టణంలోని స్థానిక మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ చెవిటి లక్ష్మీదేవి ,ఉప సర్పంచ్ గడ్డం భువనేశ్వర్ రెడ్డి, ఎంపిపి గోకుల్ లక్ష్మి, వైస్ ఎంపీపీ రాజా రాణి,అధ్యర్యంలో కొత్తగా మంజూరైనా పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేప్పట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జడ్పీటీసీ బొరెడ్డి శ్రీరామ్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ దిలీప్ చక్రవర్తి, వ్యవసాయ సలహామండలి చైర్మన్ మెట్టు వెంకటేశ్వర రెడ్డి, డోన్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మెన్ బోరెడ్డి పుల్లారెడ్డి, పాల్గొన్నారు. కొత్తగా మంజూరైన 82 మంది నూతన లబ్ధిదారులకు అధికారులతో కలిసి పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలకు దూరం కాకూడదనేది సీఎం వైయ‌స్ జగన్‌ సంకల్పమని అందుకే అర్హులై ఉండి సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకున్న వాళ్లకు వెంటనే తమ ప్రభుత్వం పథకాలు మంజూరు చేస్తోందని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా పింఛన్లు మంజూరు చేయడంతో పాటు ప్రతి నెలా ఒకటో తేదీన వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ తలుపుతట్టి పింఛన్లు అందిస్తున్న ఘనత సీఎం జగన్ కే దక్కిందన్నారు.ఈ కార్యక్రమంలో బోరెడ్డి రాము, రాజా నారాయణ మూర్తి, జంగం చంద్రయ్య, ఎంపిడిఓ ఫజుల్ రెహమాన్, ఈఓఆర్డీ బాలకృష్ణ, పంచాయతీ సిబ్బంది,సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. ప్రజా నేత్ర రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి.

Leave A Reply

Your email address will not be published.