జంతు జనన నియంత్రణ కేంద్రం ను పర్శీలించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి , జిల్లా కలెక్టర్ శ్రీహర్ష ,

జోగులాంబా గద్వాల్ జిల్లా గద్వాల జిల్లా కేంద్రంలోని 31వ వార్డ్ పరిధిలోని జిల్లా వెటర్నరీ కార్యాలయ ఆవరణలో రూ. 35 లక్ష వ్యయంతో నిర్మాణం చేసిన జంతు జనన నియంత్రణ కేంద్రం ను *ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమెహన్ రెడ్డి * పాటు *జిల్లా కలెక్టర్ శ్రీహర్ష * చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించడం జరిగినది.అనంతరం జంతు జనన నియంత్రన కేంద్ర లోను ఎమ్మెల్యే , జిల్లా కలెక్టర్, ఛైర్మన్ పరిశీలించడం జరిగినది .తెలంగాణ రాష్ట్రంలోని సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ గారు లో ఆధ్వర్యంలో జంతు జనన నియంత్రణ కేంద్రం ప్రారంభించడం జరిగిందన్నారు. కుక్కలు, కోతుల బెరద రోజు రోజుకు పెరిగింది. దీంతో వృద్ధులు, వికలాంగులు చిన్నారులు ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. కాబట్టి ప్రభుత్వం పురపాలక, వెటర్నరీ సమన్వయంతో జంతు జనన నివారణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందనన్నారు. అదేవిధంగా గ్రామీణ పట్టణ ప్రాంతాలలో కుక్కలు, కోతులు ఎక్కువ ఉంటే వెంటనే పురపాలక సిబ్బందికి నేరుగా సమాచారం ఇవ్వాలని, లేదంటే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కూడా వారికి తెలియజేసేయాలని సూచించారు. ప్రజల సంక్షేమం కోసం అన్ని విధాలుగా ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బియస్ కేశవ్ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ రామేశ్వరమ్మ, ఎంపీపీ ప్రతాప్ గౌడ్, జెడ్పీటీసీ రాజశేఖర్, వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్స్, గద్వాల టౌన్ పార్టీ అధ్యక్షుడు గోవిందు, జిల్లా వెటర్నరీ అధికారి వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమీషనర్, తెరాస పార్టీ నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.