ఘనంగా పింగళి వెంకయ్య 146 వ జయంతి వేడుకలు

నంద్యాల జిల్లా , ప్యాపిలి : ఆగస్టు 02 ( ప్రజా నేత్ర న్యూస్) : ప్యాపిలి పట్టణంలో వయో వృద్ధుల సంక్షేమ సంఘం ఆటో కార్మికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలచాట్ల రోడ్డు ఆటో స్టాండ్ వేదికగా చేసి వైసిపి నాయకులు, వయో వృద్ధులు పతాకావిష్కరణ చేసినారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి బొరెడ్డి శ్రీరామ్ రెడ్డి, మాజీ జడ్పీటిసి దిలీప్ చక్రవర్తి మాట్లాడుతూ మన భారతదేశపు ముద్దుబిడ్డ, తెలుగుజాతి ధ్రువ నక్షత్రం, భారత జాతీయ పతాక రూపశిల్పి, మహాత్మాగాంధీ అనుచరుడు, స్వతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య గురించి, పతాక విశిష్టత గురించి స్థానికులకు వివరించారు. పండ్లు,మిఠాయి పంచారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ మెట్టు వెంకటేశ్వర్ రెడ్డి, ఉప సర్పంచ్ గడ్డం భువనేశ్వర్ రెడ్డి, డోన్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ బో రెడ్డి పుల్లారెడ్డి, వైయస్సార్ పార్టీ మండల కన్వీనర్ రాజా నారాయణ మూర్తి, మండల కో ఆర్డినేటర్ బొరెడ్డి రాము, వయోవృద్ధుల సంఘం నాయకులు మత్తు బాబాసాహెబ్, యాడికి పార్థసారథి, శ్యాంసన్, ఆటో సంఘం నాయకులు పాల్గొన్నారు.ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.