కో అపరేటివ్ సొసైటీ అవినీతి పై కలెక్టర్ కు పిర్యాదు

కో అపరేటివ్ సొసైటీ అవినీతి పై కలెక్టర్ కు పిర్యాదు

మంత్రి హరీష్ రావు అవినీతి పై స్పందించాలి

చైర్మన్ ,సీఈఓ ను సస్పెండ్ చేయాలి

మీసం నాగరాజుయదవ్ డీసీసీ ప్రధాన కార్యదర్శి

సిద్దిపేట నియోజకవర్గం చిన్నకోడూర్ మండల కేంద్రంలోని కో ఆపరేటివ్ సొసైటీలో జరిగిన అవినీతి ,నిధుల స్వాహా పై కాంగ్రెస్ పార్టీ పక్షాన జిల్లా ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజుయదవ్ జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేసారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలెక్టర్ వెంటనే పూర్తి స్థాయిలో విచారణ చేపించాలని డీసీవో ను ఆదేశించినట్లు తెలిపారు .డీసీవో స్పందించి వివిధ పేపర్లలో వచ్చిన వెంటనే కొంత సమాచారం తెప్పించామని కొంత అవినీతి జరిగినట్లు తెలిసిందని ,వారికి రికవరి నోటీస్ లు జారీ చేసినట్లు తెలిపరన్నారు.అంతే కాకుండా కో అపరేటివ్ ఆక్ట్ రూల్ 51 ప్రకారం పూర్తి విచారణ చేపిస్తాం అన్నారన్నారు.అదేవిధంగా లక్షల్లో అవినీతి జరిగిన ,వివిధ పేపర్లలో వచ్చిన ,ధర్నాలు చేసినప్పటికీ మంత్రి హరీష్ రావు స్పందించలేదని ,అధికారులను పూర్తి స్థాయిలో విచారణ చేయకుండా ఒత్తిడి తెస్తున్నారని మండిపడ్డారు.కో అపరేటివ్ సొసైటీ అవినీతి జరిగిన ,రైతులు రుణాలు చెల్లించినప్పటికి లోన్ ఖాతాలో వేయకుండా చైర్మన్ ,సీఈఓ స్వాహా చేసి రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కానీ హరీష్ రావు మాత్రం తన అనుచరులను కాపాడుతూ, చర్యలు తీసుకుంటాలేరన్నారు . ఇప్పటికైనా మంత్రి హరీష్ రావు స్పందించి చైర్మన్ ,సీఈఓ లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మీసం మహేందర్,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి కల్లూరి నర్సయ్య,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సందబోయిన పర్శరం, యూత్ కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షుడు అంతగిరి చెంద్రశేకర్ ,nsui, మండల అధ్యక్షుడు ప్రశాంత్,యూత్ కాంగ్రెస్ నాయకులు జయంత్ ,కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.