ఏపీఎండీసీ త్రివేణి కంపెనీ లో సి ఐ టి యు నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక!
అన్నమయ్య జిల్లా, ఓబులవారిపల్లె మండలం, ఏపీఎండీసీ సంస్థలో పని చేస్తున్నా , మైనింగ్ త్రవ్వకాల కాంట్రాక్టర్, కింద పనిచేసే, మంగంపేట,మైనింగ్ వర్కర్స్ యూనియన్, త్రివేణి సి ఐ టి యు అనుబంధం , శనివారం కట్టా పుట్టాలమ్మ, దేవస్థానం వద్ద పి, శ్రీనివాసులు, అధ్యక్షతన సమావేశం జరిగే నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సి ఐ టి యు జిల్లా కార్యదర్శి సిహెచ్ చంద్రశేఖర్, ఒక ప్రకటనలో తెలిపారు. గౌరవ అధ్యక్షులుగా సి హెచ్ చంద్రశేఖర్, అధ్యక్షులుగా, పుల్లగంటి శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శిగా, ముత్యాల శ్రీనివాసులు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా, చౌడవరం సుదర్శన్, వర్కింగ్ సెక్రెటరీగా ఎద్దుల రాజశేఖర్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా మొక్కట్ల విజయ్ కుమార్ కోశాధికారిగా, పేసల సురేంద్ర. ఉపాధ్యక్షులుగా, డి. శంకర్ రాజు, ఎన్. శివ శంకర్, ఏ .శివయ్య, పి బాలయ్య, సహాయ కార్యదర్శులు గా, మేకల శ్రీనివాసులు, పి నాగరాజు, ఎం ప్రతాప్, వేడుక శ్రీకాంత్, మరో పది మంది కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. కమిటీ సభ్యులు, పి మహేష్ ఆర్ నరసింహరాజు, కే నరసింహులు, ఈ. బాలసుబ్రమణ్యం. ఎం.నాగరాజు, బి సురేష్, పి చలపతి, జి ప్రవీణ్, సి, లక్ష్మయ్య, టి భాస్కర్, తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ, కార్మికులు ఐక్యంగా హక్కుల కోసం పోరాటం చేయాలని పిలుపు నిచ్చారు, మొట్టమొదటగా సి ఐ టి యు యూనియన్ ద్వారా పోరాడి కనీస వేతనాల చట్టాన్ని ,పనిగంటలు, ఓటి. సెలవులు, బోనస్సు, వైద్యం, ప్రమాదనష్టపరిహారం, తదితర సమస్యలను పరిష్కరించడం జరిగిందని, మంచి అగ్రిమెంట్లు చేయడం జరిగిందని గుర్తు చేశారు. యాజమాన్యం కార్మికుల భద్రత చర్యలు చేపట్టాలన్నారు. బెంచీలు సరిచేయాలని విస్తృత పరచాలని డిమాండ్ చేశారు. సబ్ కాంట్రాక్టర్లు పనిచేసే కార్మికులకు కూడా అన్ని బెనిఫిట్స్ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాలను 46 కార్మిక చట్టాలను నాలుగు కోడులు గా మార్చే, కార్మికులకు ద్రోహం చేస్తుందని తెలిపారు. ఎనిమిది గంటల పని 12 గంటలకు మార్చడం దుర్మార్గమన్నారు., పోరాడి సాధించిన కార్మిక చట్టాలను, పోరాటాల ద్వారా నిలబెట్టుకోవాలి అన్నారు. స్వాతంత్రోద్యమంలో ఎటువంటి పాత్ర లేని, ఆర్ఎస్ఎస్ వారసులు బిజెపి నేతలు, త్రివర్ణ పతాకం వ్యతిరేకించినవారు, స్వాతంత్ర వేడుకలు జరపాలని పిలుపునివ్వడం అవివేకమన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో కమ్యూనిస్టుల యొక్క త్యాగము, పోరాటము వెలకట్టలేనిది అన్నారు. సంపూర్ణ స్వాతంత్రానికి పిలుపునిచ్చింది మొట్టమొదట కమ్యూనిస్టులే అన్నారు.