ఎరుకల జాతి బిడ్డలందరూ ఒక్కతాటిపై నడవాలి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ : బాలకృష్ణ

ప్యాపిలి పట్టణంలో స్థానిక ఏకలవ్య సర్కిల్ నందు ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా ఏకలవ్య విగ్రహనికి పూలమాలలు వేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ వై . ఎస్ . ఎస్ నంద్యాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బాలకృష్ణ మాట్లాడుతూ ఆదివాసులు అయినాఎరుకల జాతి బిడ్డలందరూ ఒక్కతాటిపై నడుస్తూ తమ యొక్క హక్కులను పూర్తి స్థాయిలో వినియోగించుకొని అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగాఏపీ వై ఎస్ ఎస్ రాష్ట్ర యూత్ అధ్యక్షుడు మహేంద్ర పాల్గొన్నారు.నంద్యాల జిల్లా కోశాధికారి గోపాల్ ప్యాపిలి మండలనాయకులు ,శేషాద్రి,
సుధాకర్, వెంకటేష్, గురుమూర్తి, వెంకట్ రాముడు తదితరులు తదితర మండల నాయకులు పాల్గొన్నారు.

🎤 ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.