మన ఊరు.. మన బడి.. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..

జయశంకర్ భూపాలపల్లి, జూన్ 30;ప్రభుత్వ పాఠశాలల సమగ్ర అభివృద్ధి కోసం మన ఊరు- మనబడి కార్యక్రమాన్ని చేపట్టి కోట్ల రూపాయల నిధులు కేటాయించి ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన అందించడానికి అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నాం అని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్ర ఒక ప్రకటనలో తెలిపారు. పిల్లలందరినీ సర్కారు బడుల్లో నే చదివించే విధంగా ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అటువంటి మన ఊరు- మన బడి కార్యక్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 548 పాఠశాలలకు గాను, మొదటి విడతగా 88 ప్రాథమిక పాఠశాలలు 10 ప్రాథమికోన్నత పాఠశాలలు 51 ఉన్నత పాఠశాలలో మొదటి ధశలో ఎన్నిక కాబడినవని కలెక్టర్ తెలియజేశారు. ఈ పాఠశాలలో 12 అంశాలలో అభివృద్ధి పనులు జరుగుచున్నవి ఆయన అన్నారు. జిల్లాలో దాదాపుగా 23 కోట్ల రూపాయలతో అంచనాలు వేయబడి పనులు జరుగుతున్నవి. ఒక్కొక్క పాఠశాలకు 30 లక్షల లోపు పనులు ఎస్ఎంసి ఆధ్వర్యంలో 30 లక్షలు దాటిన టువంటి పనులు టెండర్ ద్వారా నిర్వహించబడతాయని కలెక్టర్ పేర్కొన్నారు జిల్లాలోని మొదటి దశలో ఎన్నిక కాబడిన పాఠశాలలను త్వరలోనే అన్ని మౌలిక వసతులు కల్పించి సిద్ధం చేయనున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.