భారత మాత ముద్దు బిడ్డ, రాజనీతిజ్ఞుడు, జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా డా కొత్తపల్లి శ్రీనివాస్ జిల్లా బిజెపి అద్యక్షులు ఈ రోజు శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా కొమరం భీం జిల్లా అధ్యక్షులు డా కొత్తపల్లి శ్రీనివాస్ గారి అధ్యక్షతన కాగజ్ నగర్ లోని స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో వారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మాట్లాడుతూ భారత దేశ ఐక్యత, సమగ్రత కాపాడే దిశగా వారు చేసిన పోరాటం ప్రతి భారతీయుని ప్రెరణత్మకం. భారతదేశానికి రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానమంత్రులు,రెండు జాతీయ చిహ్నాలు ఉండకూడదు అనే నినాదం తో భారతదేశాన్ని చూడాలనే డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ కలను ప్రధాని నరేంద్ర మోడీ నెరవేర్చారు అన్నారు.శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారు స్వాతంత్ర సమరయోధులు రాజనీతిజ్ఞులు, మాజీ కేంద్రమంత్రి,జాతీయ ఐక్యత మరియు సమగ్రతకు పర్యాయపదంగా నిలిచిన గొప్ప జాతీయవాది, ఖండిత భారతపు అఖండత్వం కోసం బలిదానం చేసిన మొట్టమొదటి దేశభక్తుడు,జమ్మూకాశ్మీర్ కి ప్రత్యేక ప్రతిపత్తి ఉండరాదని పోరాడి అసువులు బాసిన పోరాటయోధుడు అంతేకాకుండా జనసంఘ్ స్థాపకులు డా.శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు ఆ మహనీయుడికి నా శతకోటి వందనాలు చేస్తూ వారి సేవలను స్మరించుకుందాం అని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి సిర్పూర్ నియోజకవర్గం సీనియర్ నాయకులు ఠాకుర్ విజయ్ సింగ్, జిల్లా యువ మోర్చా ప్రధాన కార్యదర్శి మేడి కార్తీక్, అల్లి వసంత్ రావ్,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రిపోర్టర్