ఎమ్ వీ ఐ మహమ్మద్ సిరాజ్ ఉర్ రహమాన్ గారిని ఘనంగా సన్మానించ అంబాల ప్రభాకర్ (ప్రభు)
ప్రజా నేత్ర న్యూస్ //కరీంనగర్ జిల్లా హుజరాబాద్ బుధవారం రోజున హుజురాబాద్ లోని తమ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రభు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం హుజూరాబాద్ నియోజక వర్గంలో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన దళిత బంధు పథకం నిష్పక్షపాతంగా, విజయవంతంగా అమలు చేయాలనే సంకల్పంతో ఉద్యోగాన్ని ఉద్యమంలా నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలియజేశారు. హుజురాబాద్ మోటర్ వెహికిల్ ఇనస్పెక్టర్ (ఎమ్ వీ ఐ) మహమ్మద్ సిరాజ్ ఉర్ రహమాన్ ని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం రిటైర్మెంట్ సమయం దగ్గర ఉండగా మూడు సంవత్సరాలు తన సర్వీస్ ను పొడిగించడంతో ప్రజలకు మరో మూడు సంత్సరాలపాటు తను సేవ చేసే అవకాశం కలిగిందని తెలిపారు. ఇట్టి గొప్ప పథకాన్ని దళితులందరు ఉపయోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు అంబాల రాజు, అంబాల కిరణ్ కుమార్, రాసపెల్లి సునీల్, దాసారపు సదానందం, పులియాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.ప్రజా నేత్ర ప్రతినిధి దొడ్డే రాజేంద్ర ప్రసాద్.