PDSU ఆధ్వర్యంలో కలెక్టర్ కి వినతిపత్రం

నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పీజీ కళాశాలలో కోర్టు ఏర్పాటు చేయాలనే ఆలోచన ను విరమించుకోవాలని PDSU ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా *PDSU జిల్లా అధ్యక్షులు సునారికారి రాజేష్ మాట్లాడుతూపేద,గిరిజన విద్యార్థుల కు ఉన్నత విద్యకు దూరం చేయడానికి కుట్ర చేస్తున్నారు.* విద్యారంగాన్ని బలోపేతం చేస్తానని చెప్పిన ప్రభుత్వం ప్రస్తుత ఉన్న పీజీ కళాశాల ను మూసి కోర్టు ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసం.పీజీ కళాశాల ను మూసివేసి ఆలోచన ను విరమించుకోవాలని PDSU డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మాలవత్ జేవింద్,లింగన్న,రాజేందర్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.