180 కిలోల పత్తి విత్తనాలు స్వాధీనం కేసు నమోదు: ఎస్సై శేఖర్‌రెడ్డి
ధరూర్ : ధరూర్ మండలం మార్లబీడు లో అనుమతిలేకుండా ఇంట్లో నిల్వ ఉంచిన విత్తనాలను ధరూరు పోలీసులు తనిఖీ చేసి పట్టుకున్నారు. ఎస్సై శేఖర్ రెడ్డి కథనం మేరకు.. గ్రామానికి చెందిన పెద్దింటి తిమ్మప్ప సొంత ఇంట్లో 180 కిలోల బీటీ హెచ్ టి పత్తి విత్తనాలు నిల్వ ఉంచినట్లు సమాచారం తో పోలీసులు, వ్యవసాయ అధికారులతో కలిసి సోదాలు చేశారు. పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకొని,వ్యవసాయ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.