రైల్వేకోడూరులో టిటిడి కళ్యాణ మండపం, ఆర్టీసీ డిపో గ్యారేజీ ఏర్పాటు చేయాలి. సిపిఎం డిమాండ్

అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గ  హెడ్ కోటర్ లో టిటిడి కళ్యాణ మండపం, ఆర్టీసీ, డిపో మరియు గ్యారేజీ ఏర్పాటు చేయాలని, సిపిఎం పార్టీ జిల్లా నాయకులు సి హెచ్ చంద్రశేఖర్, సీనియర్ నాయకులు మోడీ సుబ్బరామయ్య,  పి. మౌలాలి భాష,  స్థానిక సిపిఎం పార్టీ ఆఫీసులో ఆదివారం విలేకర్ల సమావేశంలో డిమాండ్ చేశారు. పేద ప్రజలు వివాహాలు చేసుకోవాలంటే లక్షల రూపాయలు ప్రవేట్ కల్యాణ మండపాలకు చెల్లించాల్సి వస్తుందని, శివాలయం భూముల్లో రెండు ఎకరాల్లో, టిటిడి కళ్యాణ మండపం ఏర్పాటు చేయాలని, నియోజకవర్గ  హెడ్ క్వార్టర్ అయినా రైల్వేకోడూరులో ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కనే డిపో, మరియు గ్యారేజి వర్క్ షాపు, ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని మండలాలకు జిల్లా కేంద్రానికి, ఇతర జిల్లాలకు ఈ డిపో నుంచి సర్వీసులు నడపాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అన్నమయ్య జిల్లా కేంద్రమైన, రాయచోటికి, కోడూరు నుండి ఒక్క సర్వీస్ కూడా లేదని, ఇప్పటికే కలెక్టర్ దృష్టికి కి, రెండు దఫాలుగా, తీసుకోవడం జరిగిందని తెలిపారు. కోడూరు నుండి రాజంపేట మీదుగా , రాయచోటికి, కొన్ని సర్వీసులు, కోడూరు నుండి చిట్వేలి,  పెనగలూరు బెస్త పల్లి మీదుగా, వయా రాజంపేట, రాయచోటి కి, కొన్ని సర్వీసులు, అదేవిధంగా తిరుపతి డిపో నుండి రాయచోటికి, కడప డిపో నుండి రాయచోటికి, బస్సు సర్వీసులు నడపాలని  డిమాండ్ చేశారు. సరైన రవాణా సౌకర్యం లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా, రాజధానికి దగ్గరైనా కోడూరు వెంకటగిరి రోడ్డు ని, ఫారెస్ట్ క్లియరింగ్ చేసి,  రోడ్డు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.  ఈ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.