రిజిస్ట్రేషన్ లేని లోన్ యాప్స్ లో రుణం తీసుకోకండి జిల్లా ఎస్పీ జె. సురేందర్ రెడ్డి

జయశంకర్ భూపాలపల్లి, మే 27;లోన్ యాప్స్ ప‌ట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల‌ని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి జె సురేందర్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతo ఎక్కువగా చదువుకున్న వారు కూడా రుణాల యాప్ పేరుతో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నారని, లోన్ ఇస్తామని చెప్పి ముందుగానే ఫీజులు వసూలు చేసేవారు ఒక రకమైతే, లోన్ లు ఇచ్చి అధిక వడ్డీతో అధిక మొత్తంలో వసూలు చేయడం మరో రకమని, తీసుకొన్న లోన్ మొత్తం కట్టిన ఇంకా లోన్ క్లియర్ కాలేదు అని బ్లాక్ మెయిల్ చేయడం, పదే పదే కాల్ చేస్తూ అసభ్యకరంగా ఫోన్ చేసి మాట్లాడడం, ఫోటోలను మార్ఫింగ్ చేసి కాంటాక్ట్స్ లో ఉన్న అందరికి పంపిస్తాం అని బెదిరింపులకు పాల్పడుతారని పేర్కొన్నారు. ప్లే స్టోర్ లో రిజిస్ట్రేషన్ లేని లోన్ ఆప్స్ చాలా ఉన్నాయని, వాటిని ప్రజలు డౌన్లోడ్ చేసుకుని వారు అడిగిన కండిషన్స్ అన్నిటికీ I AGREE అనడం వల్ల మీ సమాచారం అంతా సైబర్ నేరగాళ్ల చేతికి పోతుందని,… ప్రజలు అవగాహన లేకుండా I AGREE అని ప్రెస్ చేయవద్దని, చేస్తే సైబర్ నేరగాళ్లు మీ ఫొటోస్, మెసేజెస్, కాంటాక్ట్స్, లొకేషన్స్ పొందగలుగుతున్నారన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. సులభంగానే, త్వరితగతిన రుణం లభిస్తోందని, అనధికార డిజిటల్ లెండింగ్, మొబైల్ యాప్స్ ద్వారా లోన్ తీసుకునేటప్పుడు జగ్రత్తగా ఉండాలని, మొబైల్ యాప్ ద్వారా లోన్ తీసుకునేటప్పుడు సదురు కంపెనీ వివరాలను పూర్తిగా ధృవీకరించుకోవాలని, వాటిప‌ట్ల జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఎస్పి సూచించారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు ……

👉మీకు ఫోన్‌లో ఏదైనా లోన్ మెసేజ్ వచ్చినట్లయితే, దానిని పట్టించుకోకండి…

👉మెసేజ్‌లో లింక్ ఉంటే దానిపై క్లిక్ చేయకండి. సందేశం పంపిన లేదా కాల్ చేసిన వ్యక్తిని బ్లాక్ చేయండి, తద్వారా మీరు మళ్లీ మోసపోకుండా ఉంటారు…

👉ఫోన్ లేదా మెసేజ్‌లో ఏదైనా సమాచారం అడిగితే ఇవ్వకండి. బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు లేదా ఖాతా సమాచారాన్ని షేర్ చేయవద్దు….

👉మీకు తెలియని నంబర్ నుండి ఈ రకమైన మోసపూరిత సందేశం లేదా కాల్ వస్తే, జిల్లా సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేయండి మరియు దాన్ని బ్లాక్ చేయండి….

Leave A Reply

Your email address will not be published.