రెండో రోజు దేశవ్యాప్త సమ్మె డిప్యూటీ తహసిల్దార్ వినోద్ కుమార్ కు వినతి పత్రం

దేశవ్యాప్త నిరసనలో భాగంగా నేడు మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ను నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మె రెండో రోజు పర్వతగిరి మండల డిప్యూటీ తహసిల్దార్ వినోద్ కుమార్ కు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేసిన ప్రజా సంఘాల నాయకులు. సిఐటియు మండల కన్వీనర్ జిల్లా రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మాదాసి యాకూబ్, అఖిలభారత రైతు సంయుక్త సభ జిల్లా కన్వీనర్ వల్లం దాస్ కుమార్. మాట్లాడుతూ. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత కార్మిక కర్షక రైతు ఉద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తూ దేశ ఆర్థిక వనరులను సమకూర్చే ప్రభుత్వ రంగ సంస్థలైన విమానాశ్రయాలు,రైలు, బొగ్గు, గన్నులు, బ్యాంకులు, జీవిత భీమా, సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అమ్ముతూ స్వదేశీ పేరుతో విదేశీ బహుళ సంస్థలకు దేశ సంపదను తాకట్టు పెడుతూ మోడీ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు మరో స్వతంత్ర పోరాటానికి సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజలు సమరశీల పోరాటలకు సిద్ధం కావాలని పెట్రోల్ డీజిల్ నిత్యవసర వస్తువుల దరలకు అడ్డూ అదుపు లేకుండా పోతుందని …మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు…. పేద ప్రజల పై కేంద్ర ప్రభుత్వం ధరలు విపరీతంగా పెంచుకుంటూ పోతుందని కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకముగా జరుగుతున్న పోరాటాలలో అన్ని వర్గల ప్రజలు కలిసి రావాలని వారు పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో యుటిఎఫ్. జిల్లా నాయకులు బైరి తిరుపతి, పాక శ్రీనివాస్, టిడిటిఎఫ్ జిల్లా కార్యదర్శి మహంకాళి రామస్వామి, గ్రామపంచాయతీ యూనియన్ నాయకురాలు. పి సావిత్ర, ఒగ్గు సుగుణమ్మ, వెల్దుర్తి మంజుల, ఒగ్గు యాకయ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.