బైబిల్ మిషన్ ప్రపంచ రికార్డు పొందిన అద్భుత కుమార్ గారికి అభినందించిన గద్వాల్ ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లోని అనంతపురం జిల్లా గుత్తి నియోజకవర్గంలో గుత్తి చర్చి లో బైబిల్ మిషన్ ప్రపంచ రికార్డు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారురెవ బి అద్భుత కుమార్ గారికీ గద్వాల ఎమ్మెల్యే గారు పుష్పగుచ్చం ఇచ్చి అభినందించడం జరిగిందిఎమ్మెల్యే మాట్లాడుతూ..తెలుగు రాష్ట్రాల్లో వేలాది లక్షలాది మంది ప్రజలు గుత్తి చర్చి కి వచ్చి ఆశీర్వాదం పొందడం చాలా సంతోషంగా ఉంది ఈ గుత్తి చర్చి వరల్డ్ రికార్డ్ ఆఫ్ లండన్ లో నమోదు అయినందుకు రెవ బి అద్భుత కుమార్ గారికి శుభాకాంక్షలు అలాగే *తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు * తరపున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.దేవుని ఆశీర్వాదం తో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు వ్యవసాయం, వ్యాపారం, విద్య, వైద్య, అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కోరడం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నాగిరెడ్డి, మల్డకల్ మండలం యూత్ అధ్యక్షుడు ప్రవీణ్, తెరాస పార్టీ నాయకులు భాస్కర్, కురుమన్న, ఆంజనేయులు, విజయ్, బాబు, తదితరులు పాల్గొన్నారు.

జోగులంబా గద్వాల్ జిల్లా బండి కిరణ్ కుమార్ జిల్లా స్టాపర్

Leave A Reply

Your email address will not be published.