డాక్టరేట్ పొందిన కృష్ణ ను మర్యాదపూర్వకంగా కలిసిన సమాచార హక్కు రక్షణ చట్టం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండగుర్ల కమలాకర్

ప్రజానేత్ర న్యూస్, ఆదిలాబాద్ తేదీ:04-12-2011 ; కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజనగర్ మండలం భట్టుపల్లి గ్రామంలో వరల్డ్ హ్యూమన్ రైట్ ప్రొటెక్షన్ కమిషన్ (WHRPC) నందు గౌరవ డాక్టరెట్ పొందిన క్రిష్ణను మర్యాద పూర్వకంగా కలిశారు. మొక్కను అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా కొండగుర్ల కమలాకర్ మాట్లాడుతూ డాక్టర్ క్రిష్ణ చేసిన సామజిక సేవలు పలువురికి ఆదర్శమన్నారు. మేధస్సు కలిగిన సామాన్య వ్యక్తిని దేశ సంపంతి గా గుర్తించడం జిల్లాకే గర్వకారణం అన్నారు. జిల్లాలో అమలు చేస్తున్న పథకాలలో, కార్యక్రమంలో డాక్టర్ కృష్ణను భాగస్వామ్యం చేస్తూ వారి సలహాలు, సూచనలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. డాక్టర్ క్రిష్ణ చేస్తున్న సామజిక సేవా లకు సమాచార హక్కు రక్షణ చట్టం-2005 తెలంగాణ రాష్ట్ర కమిటీ సహకరిస్తుందని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.