18 సంవత్సరాలు నిండిన మత్య్సకారులకు నూతన సభ్యత్వాలు ఇవ్వండి!

సిద్దిపేట అర్బన్ తెలంగాణ ప్రభుత్వం ముదిరాజుల గురించి ఆలోచన చేసి ముదిరాజులకు ఆర్థిక బంధు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మత్య్సకారుల సంక్షేమా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ గారు కోరారు.సిద్దిపేట అర్బన్ మండలం, మిట్టపల్లి ముదిరాజ్ సంఘంలో ఏర్పాటు చేసిన నియామక సమావేశంలో జంగిటి మాట్లాడుతూ అనేక పథకాలను ప్రవేశపెడుతున్న కేసీఆర్ గారు ముదిరాజులకు ఒక్క పథకమైన ఇవ్వరా అని ప్రశ్నించారు.రాష్ట్ర కార్యదర్శి కొమురవెళ్లి నర్సింహులు మాట్లాడుతూ ముదిరాజ్ లందరూ ఏక తాటిపైకి వచ్చి పోరాటం చేసినప్పుడే మనము ఆర్థికంగా బలపడగలమని అన్నారు.అనేక ఫలాల షేకారణలో ముందుండే ముదిరాజులు పోరాటంలో వెనుకబడుతున్నారని అన్నారు.జిల్లా అధ్యక్షులు పడిగె భాస్కర్, ప్రధాన కార్యదర్శి గణపూర్ మల్లేశంలు మాట్లాడుతూ ముదిరాజులు విద్యలో వెనుకబడి ఉన్నారని తద్వారా మనకున్న జీ.ఓ ల గురించి తెలుసుకోలేక పోయామని తెలియజేయాల్సిన ప్రభుత్వాలు ముదిరాజుల విషయంలో అలసత్వం వహించారని అన్నారు.ఈ సందర్భంగా మండల ప్రధాన కార్యదర్శిగా వెంకటేష్, గ్రామ అధ్యక్షునిగా రామచంద్రం లను నియమించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు కండ్లకోయ బాల కృష్ణ, మండల అధ్యక్షుడు కొరివి నర్సింహులు, కన్వీనర్ లు బోనాల శ్రీనివాస్, కాస రమేష్, కోరమేన యాదగిరి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు…. తాడూరి ముత్తేశ్ ప్రజానేత్ర న్యూస్ ఛానల్ రిపోర్టర్ చిన్నకోడూరు మండలం.

Leave A Reply

Your email address will not be published.