సేవ్ ఇండియా సేవ్ డెమోక్రసీ

ప్యాపిలి, సేవ్ ఇండియా సేవ్ డెమోక్రసీదేశవ్యాప్త పిలుపులో భాగంగా ప్యాపిలి పట్టణంలో ని బస్టాండ్ అబేద్కర్ సెంటర్లో వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం సిఐటియు జిల్లా కార్యదర్శి పులా శేఖర్ , సిపిఐ మండల కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ దేశానికి రైతాంగానికి నష్టదాయకమైన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని శతాబ్ద కాలంగా కార్మికుల పోరాడి సాధించుకున్న చట్టాలను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తూ ఉందని యాంత్రీకరణ పెరిగి ఉపాధి కూలీల పని దినాలు తగ్గిపోతున్నాయి అని కేంద్ర ప్రభుత్వం వల్ల కార్మిక రైతాంగం వ్యవసాయ కూలీలు రోడ్డున పడే పరిస్థితి తీసుకొస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు దేశంలో దుర్మార్గమైన పరిపాలన కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్మిక సంఘం నాయకులు రైతు సంఘం నాయకులు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, ఆటో డ్రైవర్ల సంగం అధ్యక్షులు షఫీ, మద్దిలేటి, మధు, శేషు పాల్గొన్నారు.
? ప్రజా  నేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.