సచివాలయ ఆరోగ్య కార్యదర్శులకు ఆప్రా ను (డ్రెస్ కోడ్) పంపిణీ
ప్యాపిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జెడ్పీటిసీ సభ్యులు బోరెడ్డి శ్రీరామ్ రెడ్డి , మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ మెట్టు వేంకటేశ్వర రెడ్డి, ఉప సర్పంచ్ భువనేశ్వర రెడ్డి , ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఇంతియాజ్ గారి అధ్యక్షతన సచివాలయం ఆరోగ్య కార్యదర్శులకు ఆప్రా ను (డ్రెస్ కోడ్) పంపిణీ చేసినారు.ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతు. సచవాలయము లో ఆరోగ్య మిత్రలు గా ఉండి కాన్పులకు వెళ్ళే గర్భిణీ మహిళలను,అవసరం మేరకు వివిధ రకాల వ్యాధులు కలిగిన రోగులను,సీరియస్ గా ఉండే రోగులను డాక్టర్ . వైయస్సార్ ఆరోగ్య శ్రీ హెల్ప్ లైన్ ఆసుపత్రులకు రెఫెర్ చేసి ప్రజలకు సేవ చేయవలెనని వారు తెలియజేశారు.ఈ కార్య క్రమం లో ఆరోగ్య విద్యా బోధకుడు ఎల్. రాఘేంద్ర గౌడ్, జయరాం, గంగాదేవి, మనోహర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, ఆరోగ్య కార్య కర్త లు పాల్గొన్నారు.
🎤 ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి