వెల్దుర్తి రైతు భరోసా కేంద్రాలలో చైర్మన్ల ఆధ్వర్యంలో గ్రామ వ్యవసాయ సలహా కమిటీ సమావేశం

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం లో శుక్రవారం రోజు 18 రైతు భరోసా కేంద్రాల్లో చైర్మన్ ఆధ్వర్యంలో గ్రామ వ్యవసాయ సలహా కమిటీ సమావేశం ఏర్పాటు చేయబడినది. ఈ మీటింగ్ నందు గ్రామంలలో అవసరమైన ఫర్టిలైజర్సు మరియు పురుగుమందులను అందుబాటులో ఉండేలా చూడమనడం జరిగింది. అలాగే పంట నమోదు గురించి తెలుపుతూ ప్రతి రైతు తప్పనిసరిగా హార్టికల్చర్, సెరికల్చర్, అగ్రికల్చర్ ప్రతి పంట నమోదు చేసుకోవాల్సిందిగా తెలిపారు. పురుగు మందు స్ప్రే చేయదలచినప్పుడు ఆర్ బి కే లో సంప్రదించి చేయవలెనని తెలిపారు. ఆర్.బి కే లో 50 శాతం సబ్సిడీ కింద ట్రైకొడిర్మావిరి డి, psb ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా micro-nutrients జింకు, బోరాన్, జిప్సం, మెగ్నీషియం సబ్సిడీ కింద ఇవ్వాలని కమిటీలు కోరడమైనది. ఈ సమావేశం నందు మండల వ్యవసాయ అధికారి రవి ప్రకాష్, బొమ్మిరెడ్డి పల్లి చైర్మన్ కే చక్రపాణి రెడ్డి ఇ మల్లేపల్లి కే రామిరెడ్డి, ఆర్ బి కే 2 వెల్దుర్తి కోదండరాముడు, వెల్దుర్తి RBK 3 యన్. మోహన్ అన్ని గ్రామాల చైర్మన్లు మెంబర్లు పాల్గొనడం జరిగింది…ప్రజానేత్ర. న్యూస్. మౌలాలి

Leave A Reply

Your email address will not be published.