విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటాం-సిఐటియు హెచ్చరిక
ఆంధ్ర రాష్ట్ర మణిరత్నమే నా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని మొండిగా వ్యవహరిస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మెడలు వంచి అడ్డుకుని తీరుతామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి గౌస్ దేశాయ్ హెచ్చరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ డిల్లీ లో చేస్తున్నా పోరాటానికి మద్దతుగా ఈరోజు వెల్దుర్తి మండల కేంద్రంలో సిఐటియు మండల అధ్యక్షుడు రాజు అధ్యక్షతన నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దేశాయ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సి ఐ టి యు సంఘీభావాన్ని వ్యక్తం చేస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టిందని ఆయన తెలిపారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవ్వడం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ప్రత్యేక హోదా ఇస్తాను, కడప స్టీల్ ప్లాంట్ నిర్మిస్తాను, పోలవరం ప్రాజెక్టును నిర్మించడం కేంద్రానిదే బాధ్యత అని చెప్పి అధికారం చేపట్టిన తర్వాత అవి ఏమీ చేయకపోగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తానని మొండిగా బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తున్నదాని ఆయన విమర్శించారు. బిజెపి ప్రభుత్వం తీరు చూస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని ఆయన తెలిపారు. గతంలో ఇలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఉపయోగపడే ఆంధ్ర బ్యాంకు ను ఆంధ్ర బ్యాంక్ అనే పేరు లేకుండా యూనియన్ బ్యాంకు లో కలిపి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నష్టం చేశాడని మళ్లీ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఏకైక పెద్ద పరిశ్రమ కారుచౌకగా విదేశీ కంపెనీలకు అమ్మాయిలని చూస్తున్నారని అలా చేస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉండరని తిరగబడి బిజెపి ప్రభుత్వం భరతం పడతారని ఆయన హెచ్చరించారు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆలోచనను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో చాలా మంది నిరుద్యోగులు ఉపాధి లేక దేశంలో వివిధ పట్టణాలకు వలస వెళుతుంటే అలాంటి యువతకు ఉపాధి కల్పించడానికి ఉపయోగపడే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేతికరణ చేయాలనుకోవడం దుర్మార్గమైన పని ఆయన విమర్శించారు. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలని అప్పుడే బీజేపీకి చిత్తశుద్ధి బయటపడుతుందని ఆయన తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఉపాధి కల్పించడం కోసం ఉపయోగపడే చర్యలు తీసుకోవాలి తప్ప ఉన్న ఉపాధిని కొల్లగొట్టే ప్రయత్నం మానుకోవాలని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లో లో సిపిఎం సిపిఎం మండల కార్యదర్శి రాముడు మోటర్ వర్కర్స్ యూనియన్ నాయకులు పెద్ద రాముడు, నాగరాజు, వెల్దుర్తి హమాలి యూనియన్ నాయకులు మారెన్న,పెద్దన్న, ఎసేపు తదితరులు హాజరయ్యారు……ప్రజానేత్ర. న్యూస్.మౌలాలి