విలేకరి హత్య కేసులో ముద్దాయిలను వెంటనే అరెస్ట్ చేయాలి..

నంద్యాల పట్టణంలో విలేఖరి కేశవ్ ను హత్య చేసిన ముద్దాయిలను వెంటనే అరెస్ట్ చేయాలని వెల్దుర్తి పాత్రికేయ సంఘం డిమాండ్ చేసింది. సోమవారం ఆ సంఘం ఆధ్వర్యంలో తాసిల్దార్ రాజేశ్వరికి వినతిపత్రం అందించారు. గుట్కా దందా ను బయట పెట్టడం వల్లే ఈ హత్య జరిగిందని ఇందుకు కారణమైన ప్రతి ఒక్కరిని వెంటనే అరెస్టు చేయాలన్నారు. అంతేకాకుండా ఆ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని అన్నారు. అలాగే కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం తో పాటు 50 లక్షల రూపాయలు వారికి ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయ సంఘం సభ్యులు తాజ్ బాబా, ఒమెంద్ర, రాజశేఖర్, చిరంజీవి అశోక్, చిన్న, మౌలా, సువర్ణ తదితరులు పాల్గొన్నారు….ప్రజానేత్ర. న్యూస్.మౌలాలి

Leave A Reply

Your email address will not be published.