మహిళా ట్రైనీ ఎస్సై పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా రుజువైతే ఎస్.ఐపై చట్టపరమైన చర్యలు తప్పదు..

మహబూబాబాద్ జిల్లా పరిధిలోని పోలీస్ స్టేషన్లో ట్రైనీ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న మహిళా ట్రైనీ ఎస్సై పై సదర్ పోలీస్ స్టేషన్ ఎస్సై పి. శ్రీనివాస్ రెడ్డి లైంగిక వేధింపులకు గురిచేసినట్లుగా మహిళా ట్రైనీ ఎస్సై మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషికి ఫిర్యాదు చేసింది .
ఈ ఫిర్యాదుపై వరంగల్ పోలీస్ కమిషనర్ తక్షణమే స్పందిస్తూ జరిగిన సంఘటనపై వాస్తవాలను విచారణ జరపడంతో పాటు మహిళా ట్రైనీ ఎస్ఐ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా రుజువైతే పి.శ్రీనివాస్ రెడ్డి ఎస్.ఐ పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.