బీసీల రక్షణకై అట్రాసిటీ చట్టం తేవాలి.

తెలంగాణ రాష్ట్రంలో నిత్య బీసీలపై అగ్రవర్ణాల దాడులు జరుగుతూనే ఉన్నాయని, పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన బాధితులకు న్యాయం జరగడం లేదని, అగ్రవర్ణాలు బీసీల పై దాడులు చేయడమే కాకుండా కులం పేరుతో దూషించడం కూడా జరుగుతుందని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం మాదిరిగా బీసీ అట్రాసిటీ చట్టం కూడా తీసుకు రావాలని, జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి గారిని జాతీయ బీసీ సంక్షేమ సంఘం, రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దయ్య యాదవ్ కోరారు. నేడు జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దయ్య యాదవ్ బృందం హైదరాబాద్ లోని జాతీయ బీసీ కమిషన్ కార్యాలయంలో కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీల మానప్రాణాలకు ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని నిత్యం బీసీలపై రాజకీయ దాడులు జరుగుతున్నాయని దాడులను ఆపడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని రాష్ట్ర బీసీ కమిషన్ పదవీకాలం ముగిసి 20 నెలలు దాటినా
బీసీ కమిషన్ ను నియమించమని తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వానికి మొ ట్టి కాయ వేసిన
నేటి వరకు బీసీ కమిషన్ చైర్మన్ ను నియమించక పోవడం వల్ల బీసీల సమస్యలు చెప్పుకోవడానికి
చాలా ఇబ్బందిగా మారిందని, బీసీ కమిషన్ చైర్మన్ ను నియమించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని రాష్ట్రంలోని బీసీల సమస్యలను ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు

Leave A Reply

Your email address will not be published.