బీసీలను వేధిస్తున్న వైసీపీ ప్రభుత్వం : బిజెపి మండలాధ్యక్షుడు కేబి దామోదర్ నాయుడు

వైసీపీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఇరవై ఆరు నెలలు అవుతున్నా కార్పొరేషన్లకు నిధులు ఇవ్వకపోగా బీసీ కార్పొరేషన్ల కోసం బీసీ సంఘం ట్రెజరీ లో ఉన్న దాదాపు 500 కోట్లు నిధులను జగనన్న విద్య దీవెన కి మళ్ళించడం ప్రభుత్వం దిగజారుడుతనానికి నిదర్శనం అని ఎద్దేవా చేశారు. బీసీలే మాకు బ్యాక్ బోన్ బీసీలకు అండగా ఉంటామని చెప్పి 56 కాళీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి బీసీలకు వైయస్ జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని ఆయన అన్నారు. ఒకరి కడుపు నింపడం కోసం మరొకరి కడుపు కొట్టడం సరైన పద్ధతి కాదు. ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక మాట అనే విధంగా ఈ ప్రభుత్వం వైఖరి ఉందన్నారు. వైయస్సార్సీపి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి దాదాపు ఇరవై ఆరు నెలలు అవుతున్నా, ఒక బీసీ కి ఒక లక్ష రూపాయలు రుణాలు ఇచ్చి నా బా పతి లేదు. వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి బీసీల పైన నిజమైన చిత్తశుద్ధి ఉంటే వెంటనే 56 కార్పొరేషన్లకు జనాభా ప్రతిపాదన ప్రకారం రుణాలు మంజూరు చేయాలి. గత స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ లు 25 శాతానికి తగ్గించి బీసీలకు అన్యాయం చేసిన ఘనత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానిదే అని అన్నారు. దీనికోసం బీసీలంతా ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
? ప్రజా  నేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.