ప్రైవేట్ పాఠశాలల పై చర్యలు తీసుకోవాలని MEOగారికి వినతి పత్రం ఇచ్చిన ఎబివిపి నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కన్వీనర్ అక్కేంనాగరాజు మాట్లాడుతూ
ఇల్లంతకుంట మండలంలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలో కరోనా కష్టకాలంలో తల్లిదండ్రుల నుంచి ఆన్లైన్ క్లాస్ ల పేరుతో అధిక ఫీజులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేస్తున్నారు కరోనా కష్టకాలంలో తల్లిదండ్రులకు ఉపాధి లేక తీవ్ర ఆర్థిక లోపంలో ఉన్న తల్లిదండ్రులను వేధిస్తున్న అట్టి ప్రైవేట్ పాఠశాలల పై వెంటనే చర్యలు తీసుకోవాలని MEO గారిని కోరుతున్నాం అని అన్నారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు అజయ్ ప్రశాంత్ విజయ్ తదితరులు పాల్గొన్నారు
బొల్లం సాయిరెడ్డి మండలం రిపోర్టార్ ఇల్లంతకుంట

Leave A Reply

Your email address will not be published.