ప్రపంచ వ్యాప్తంగా భూతాపాన్ని తక్షణమే కట్టడి చేయాలి

భారత్‌ మండుతోంది!

హిందూ మహాసముద్రం అతిగా వేడెక్కుతోంది

ప్రపంచ వ్యాప్తంగా భూతాపాన్ని తక్షణమే కట్టడి చేయాలి

లేదంటే విపత్తులు మరింత భీకరంగా ఉంటాయి

నివేదికలో ఐరాస కమిటీ హెచ్చరిక

భారత్‌లో భూతాపం ప్రభావం తీవ్రంగా ఉంది. మిగతా వాటికన్నా… హిందూ మహాసముద్రంలోనే ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. దీనివల్ల భారత్‌లో భీకర వర్షాలు, వరదలు తప్పవు. ఉష్ణోగ్రతలూ హెచ్చుస్థాయిలోనే నమోదవుతాయి. దక్షిణాసియాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. దీన్ని తక్షణమే అడ్డుకోవాలి. లేదంటే భవిష్యత్తులో ఇక మనం కట్టడి చేయలేం! రాబోయే పదేళ్లలో కరవు, వడగాల్పులు, కార్చిచ్చులు, తుపాన్లు మరింత వేగంగా, తీవ్రంగా, విస్తృతంగా ఉంటాయి. సముద్ర మట్టాలు పెరుగుతాయి.- వాతావరణ మార్పులపై ఐరాస నియమించిన అంతర ప్రభుత్వ కమిటీ (ఐపీసీసీ) సోమవారం విడుదల చేసిన నివేదిక సారాంశమిదిజెనీవా: భూతాపంపై ఐపీసీసీ సోమవారం ఆందోళనకర విషయాలను వెల్లడించింది. వందేళ్లకోసారి సముద్రమట్టం పెరుగుదలకు కారణమయ్యే విపత్తులు… ఈ శతాబ్దం చివరిలో ఆరంభమై ఏటా సంభవిస్తాయని హెచ్చరించింది. సముద్ర మట్టాల పెరుగుదల ఈ శతాబ్దమంతా కొనసాగుతుం

Leave A Reply

Your email address will not be published.