ప్రజా లైఫ్ కేర్ హాస్పిటల్ లో ఉచిత ఆర్థోపెడిక్ క్యాంపు నిర్వహణ

కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా: కాగజ్ నగర్ పట్టణంలోని ప్రజా లైఫ్ కేర్ హాస్పిటల్ లో ఈ రోజు భారత ఎముకల మరియు కీళ్ల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత ఆర్థోపెడిక్ క్యాంపు ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన హాస్పిటల్ ఆయమ్మ శ్రీమతి గంగమ్మ మరియు స్త్రీ వైద్య నిపుణులు డా.అశ్విని గారు.ఈ ఉచిత ఆర్థోపెడిక్ క్యాంపు లో రోగులను పరీక్షించిన ఎముకల మరియు కీళ్ల వైద్య నిపుణులు డా.పాల్వాయి హరీష్ బాబు, డా.సాయి చరణ్ రెడ్డి మరియు డా.ఓం ప్రకాష్.200 మందికి పైగా రోగులను పరీక్షించి వారికి వైద్య సలహాలు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు: సాధారణ వైద్య నిపుణులు డా.సాయి వివేక్, సర్జరీ నిపుణులు డా.శ్రీనివాస్, హాస్పిటల్ మేనేజ్ మెంట్ భాద్యులు అంజన్న,సతీష్, చారి, బాలు, ప్రకాష్, ప్రవీణ్, ఆన్నీ,స్వాతి, శిలవంత్, వైశాలి,రజినీకాంత్, జలంధర్, డేవిడ్ తదితరులు.పాలుగోన్నారు..

Leave A Reply

Your email address will not be published.