నరేంద్ర మోడీ కబంధహస్తాల నుండి భారతదేశాన్ని రక్షించుకుందాం.

స్థానిక గాంధీ సర్కిల్ నందు సిఐటియు పట్టణ కార్యదర్శి టి.శివరాం,ఏ ఐ టి యు సి నియోజకవర్గ కార్యదర్శి అబ్బాస్ అధ్యక్షతన సేవ్ ఇండియా కార్యక్రమం జరిగింది.సి ఐ టి యు – ఏ ఐ టి యు సి – రైతు సంఘం – వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో జరిగిన సేవ్ ఇండియా కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి రంగనాయుడు,కాంగ్రెస్ పార్టీ ప్యాపిలి మండల అధ్యక్షుడు సుబ్బు యాదవ్,ఏ ఐ టి యు సి జిల్లా అధ్యక్షుడు సుంకయ్య,యుటిఎఫ్ రాష్ట్ర మాజీ గౌరవ అధ్యక్షులు నరసింహుడు,జిల్లా నాయకులు మాణిక్యం శెట్టి,జిల్లా కార్యదర్శి అబ్దుల్ తీఫ్,బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ సాయి, ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి శివన్న పాల్గొని మాట్లాడుతూ నరేంద్ర మోడీ కబంధహస్తాల నుండి భారతదేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రైతు వ్యతిరేక చట్టాలు, విద్యుత్ బిల్లు,నాలుగు లేబర్ కోడ్ లు, డ్రైవర్లకు ఉరితాడు లాంటి జీవో నెంబర్ 21 రద్దు చేయాలని,విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ,ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ,కార్పొరేటీకరణ ఆపాలని, పెట్రోల్,డీజిల్,గ్యాస్,నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని,ఉపాధి హామీ కి నిధులు పెంచి అందరికీ 200 రోజులు పనులు కల్పించి రోజుకు 600 రూపాయల వేతనం ఇవ్వాలని, పట్టణ పేదలకు ఉపాధి హామీ పథకం అమలు చేయాలని,కరోనా నియంత్రణ ఫ్రంట్ లైన్ వర్కర్లకు 50 లక్షల బీమా పథకం అమలు చేయాలని,రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి విలువ ఆధారిత పన్నుల జీవోలు 196,197,198 ఉపసంహరించి,చెత్త,డ్రైనేజీ పన్నులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తాసిల్దార్ గారికి డిమాండ్లతో కూడిన మెమోరాండం అందజేశారు.ఈ కార్యక్రమంలో మోటర్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఏ,వి,భాస్కర్ రెడ్డి, సిపిఐ పట్టణ కార్యదర్శి నక్కీ శ్రీకాంత్,నాయకులు శ్రీనివాసులు, పుల్లయ్య,అన్వర్,బాలు, సూరన్న,నాగేశ్వరరావు, మద్దయ్య, సుంకన్న,రామచంద్రుడు, నూర్ భాషా, మహిళా సంఘం నాయకురాలు చాందిని,హసీనా తదితరులు పాల్గొన్నారు.

🎤ప్రజా  నేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.