దిశ మహిళా పోలీసు స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన అర్బన్ జిల్లా ఎస్సీ
అజ్యి రస్తోగి ఐ.పి.యస్ ఈ రోజు దిశ మహిళా పోలీసు స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిపోలీస్ స్టేషన్ పని తీరు, కేసుల దర్యాప్తు మరియు వివాహ సంభంద కేసుల కౌన్సిలింగ్ మరియు దర్యాప్తుల గురించి దిశ యాప్ పై ప్రజలకు అవగాహనా మరియు దిశ పెట్రోలింగ్ విధుల నిర్వహణ గురించి ఇతర అంశాలపై డిఎస్సీ తిరుమల రావుతో చర్చించారు.ఈ తనిఖీలో ఎస్పీ స్టేషన్ రికార్డు లను పర్పిలించి, రికార్డు లను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించినారు మరియు దిశ యాప్ విశిష్టతపై ప్రతి మహిళలకు ముఖ్యంగా కాలేజీ విద్యార్థినులకు మరియు మహిళా ఉద్యోగులకు పూర్తి అవగాహన కల్పించాలని తగు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. అనంతరం స్టేషన్ రిసెప్షన్ కౌంటర్, హెల్ప్ డెస్క్ లను పరిశీలించి, స్టేషన్ కు వచ్చు ఫిర్యాదుదారులతో గౌరవంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు.. పోలీస్ స్టేషన్ సిబ్బందితో మాట్లాడి వారికి ఉన్న సమస్యలను అడిగి తెలుసు కొని, వాటి పరిష్కారానికి డిఎస్పీకి తగు సూచనలు చేసినారు.