త్వరలో దహేగాం లో రైతు మహా ధర్నా

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఈ రోజు ఉదయం ఢిల్లీలో భాజపా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారిని కలిసిన సిర్పూర్ నియోజకవర్గ భాజపా నాయకులు డా.పాల్వాయి హరీష్ బాబు.ఇటీవల దహేగాం, పెంచికల్ పేట, కాగజ్ నగర్ మండలాల్లో పెద్దవాగు వరదల కారణంగా పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లిందని శ్రీ సంజయ్ గారికి వివరించిన డా.పాల్వాయి. ప్రజా ప్రతినిధులు కేవలం మాటలకే పరిమితమవుతున్నారని, నష్ట పరిహారం విషయంలో భాజపా ఉద్యమం చేయాలని సంజయ్ గారు డా.పాల్వాయి కి సూచించారు.ఆ సూచనను అనుసరించి త్వరలోనే దహేగాం మండల కేంద్రంలో రైతు మహా ధర్నా నిర్వహిస్తామని డా.పాల్వాయి రాష్ట్ర అధ్యక్షులకు తెలిపారు. భాజపా కిసాన్ మోర్చా మరియు రాష్ట్ర నాయకులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని సంజయ్ గారు అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీ సోయం బాబు రావు గారు, సౌత్ సెంట్రల్ రైల్వే DRUCC మెంబర్ జీవీ రమణ, నాయకులు చప్పిడి సత్యనారాయణ, అజయ్ జోషి తదితరులు పాల్గొన్నారు.ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రీపోటర్

Leave A Reply

Your email address will not be published.