జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి. *ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా.
జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం సత్వరమే పరిష్కారించాలని పెద్దపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చింతకింది చంద్రమొగిలి,ప్రధాన కార్యదర్శి నారాయణ దాస్ అశోక్ డిమాండ్ చేశారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. స్థానిక తెలంగాణ అమర వీరుల స్థూపం నుండి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను పరిష్కరించాలన్నారు. పెద్దపల్లి జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అక్రిడిటేషన్ తో సంబంధం లేకుండా పనిచేస్తున్న జరలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలని కోరారు. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు ప్రెస్ క్లబ్ ద్వారా ఆందోళనలను కొనసాగిస్తామని హెచ్చరించారు. న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఈ ఆందోళనలో పెద్దసంఖ్యలో ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు పాల్గొన్నారు.ప్రజానేత్ర రిపోర్టర్ లక్ష్మి నారాయణ పెద్దపల్లి