జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు పంపిణీ చేయాలని ఎమ్మెల్యే కి వినతి పత్రం

వర్కింగ్ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తెలిపారు. ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు చింతకింది చంద్రమొగిలి,నారాయణ దాస్ అశోక్ ఆధ్వర్యంలో శుక్రవారం ఎమ్మెల్యేను కలిసి ఇండ్ల స్థలాలు, డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ చేయాలని వినతి పత్రం సమర్పించారు. జర్నలిస్టుల సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో భూమి సేకరించేందుకు ఇప్పటికే అన్ని చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.భూమి అందుబాటులో లేననందున కొంత ఆలస్యమైనా జర్నలిస్టులకు ఇంటి స్థలాలు అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అమలును ప్రజల్లోకి తీసుకు వెళ్ళేది జర్నలిస్టులేనన్నారు. త్వరలో వర్కింగ్ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు అందించేందుకు హామీ ఇచ్చారు. ఈసందర్బంగా జర్నలిస్టుల సమస్యలను అడిగి తెలుసుకుని సానుకూలంగా స్పందించారు. పరిశుభ్రత, పచ్చదనం పొంపొందించేందుకు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జర్నలిస్టులు బుర్ర తిరుపతి గౌడ్, నిరంజన్, బందెల రాజశేఖర్, బర్ల రమేష్, రామకృష్ణ,లింగమూర్తి, శివాచారి ,ముఖేష్, బోనాల నాగరాజు, ఏపీ శ్రీనివాస్, పొగుల విజయ్,బాలాజీ సింగ్,ఆకుల రమేష్, సాబీర్ పాషా, మాతృశ్రీ శ్రీనివాస్, కొమిరిశెట్టి శ్రీనివాస్, వెన్నంపల్లి శ్రీనివాస్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.