జర్నలిస్టును హత్య చేసిన వారిని శిక్షించాలి.
మద్దికేర- నిజాన్ని నిర్భయంగా రాసినందుకు యూటూబ్ విలేకరి కేశవ్ ను హత్య చేయడం చాలా దారుణం నిందితుడు కానిస్టేబుల్ సుబ్బరాయుడును విధుల నుంచి తొలగించాలని సిపిఐ పార్టీ కౌలు రైతు సంఘం అధ్యక్షుడు హనుమప్ప డిమాండ్ చేశారు వీ5 యూట్యూబ్ విలేఖరి కేశవ్‌ను ఆదివారం రాత్రి హోటల్ దగ్గరకు పిలిపించి కానిస్టేబుల్ సుబ్బారాయుడు అతని తమ్ముడు నాని కత్తులతో పొడిచి చంపడం దారుణమన్నారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని, కానిస్టేబుల్‌ను విధుల నుంచి తొలగించాలని, బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పార్టీ కార్యకర్తలు కోదండరాముడు, నాగరాజు, వీరాంజనేయులు, రామాంజనేయులు పాల్గొన్నారు.ప్రజా నేత్ర రిపోర్టర్ వీరేష్