చలో హుజురాబాద్ శంఖారావం విజయవంతం చేయండి .సిఐటియు పిలుపు

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేయాలని సిఐటియు మండల కన్వీనర్ జిల్లా రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 20న తలపెట్టిన ఛలో హుజురాబాద్ శంఖారావం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం వాల్ పోస్టర్ ని ఆవిష్కరించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 21 వేలు చెల్లించాలని కారోబార్ బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని అర్హులైన కార్మికులను పర్మినెంట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కరోనా కాలంలో ప్రాణాలకు తెగించి పని చేసిన వారికి కనీస వేతనాలు పెంచాలని పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని అన్నారు. గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కార్మికులంతా చలో హుజురాబాద్ కు తరలి రావాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ & యూనియన్( సి ఐ టి యు) జిల్లా కమిటీ మెంబర్ నరకం టి రామచందర్. నాగరాజు. రవి.కొమురయ్య. ఉప్పలమ్మ. యా కమ్మ తదితర కార్మికులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.