ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు
తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు దారమోని గణేష్ ఆధ్వర్యంలోకల్వకుర్తి పట్టణం సుభాష్ నగర్ నందు తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ జాతిపిత ఆచార్య జయశంకర్ గారి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా దారమోని గణేష్ మాట్లాడుతూ జయశంకర్ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షకు పురుడు పోసిన మార్గదర్శి, స్వరాష్ట్రం స్వప్నం కోసం తొలి అడుగు తడబడక వేసి అందరికీ దారి చూపిన దిక్సూచి,తెలంగాణ ప్రజల బతుకులు స్వరాష్ట్రంలోనే బాగుపడతాయని ఎవరికి జడువక ఉద్యమానికి అందరినీ జాగృతం జేసిన ఓ దీవిటీ,ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ల వచ్చినప్పటికీ వాటికి బుగులు పడకుండా ధైర్యంగా తాను తన ఆశయాన్ని సాధించేందుకు వ్యక్తిగత జీవితాన్ని తెలంగాణ ప్రజల కోసం అంకితం చేసిన మనసున్న మహానీయులు మన పెద్ద జయశంకర్ అని కొనియాడారు .ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం కల్వకుర్తి నియోజకవర్గం కన్వీనర్ షకీల్, ఐ ఎస్ డి ఫోరం గణేష్ , యూత్ ఐకాన్అరుణ్ తేజ,జాగృతి విద్యార్థి విభాగం నాయకులు సందీప్, శరత్, పృథ్వి , రాము,శివ తదితరులు పాల్గొన్నారు.