ఘనంగా ఏఐఎస్ఎఫ్ 86 వ ఆవిర్భావ దినోత్సవం

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో AISF 86 ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. AISF జిల్లా కార్యదర్శి మేస్రం భాస్కర్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ఏఐఎస్‌ఎఫ్‌ కు భారతదేశంలో ఘనమైన పోరాట చరిత్ర ఉందన్నారు. స్వాతంత్య్రం రాకపూర్వమే ఉత్తర ప్రదేశ్లోని లక్నో నగరంలో 1936 ఆగస్టు 12 న ఏఐఎస్‌ఎఫ్‌ ఆవిర్భవించిందన్నారు. తొలిరోజుల్లో బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులను ఈ దేశం నుంచి తరిమికొట్టే ఉద్ధేశంతో, యువతీ, యువకుల్లో దేశభక్తి మెండుగా నింపిందన్నారు. పోరాటాలు, త్యాగాలే ధ్యేయంగా ఏర్పాటైన ఈ విద్యార్థి సంఘం స్వాతంత్య్రనంతరం శాస్త్రీయ విద్యావిధానం అమలుపై నిరంతరం పోరాటాలు సాగిస్తుందన్నారు. పేద విద్యార్థులకు హాస్టల్‌ సౌకర్యం, స్కాలర్‌షిప్‌ల మంజూరు, కాస్మోటిక్‌ చార్జీల పెంపు, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై నిరంతరం పోరాటాలు సాగిస్తోందన్నారు. ఐక్య ఉద్యమాలను నిర్మించి, కలిసి వచ్చే ఇతర సంఘాలతో విద్యార్థుల సమస్యల పట్ల దూసుకుపోతుందన్నారు. “చదువుతూ పోరాడు.. పోరాడి సాధించు..” నినాదాలతో విద్యార్థులకు మరింత చేరువ అవుతుందని,కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలను చీల్చిచెండాడుతూ సమరశీల పోరాటాలను కొనసాగిస్తూ సమస్యల సాధన కోసం విశేషంగా కృషిచేసిన ఘనత ఏఐఎస్‌ఎఫ్‌ కే దక్కిందన్నారు.ఈ కార్యక్రమంలో AISF నాయకులు కేశవ్, గణేష్, రమేష్ లతో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.