ఖాళీగా ఉన్న పాత గవర్నమెంట్ హాస్పిటల్ స్థలాన్ని పార్కింగ్ కు వినియోగించే ఏర్పాటు చేయండి : లోక్ సత్తా పార్టీ

చిలకలూరిపేట పట్టణంలోని నరసరావుపేట సెంటర్ నుండి రిజిస్టర్ ఆఫీస్ వరకు అన్ని పాయింట్లలో రోడ్లు దాటే విధానం కాకుండా, ఎడమ వైపు రోడ్డు దాటుటకు ఒక పాయింటు, కుడివైపు రోడ్డు దాటుటకు ఒక పాయింటు ఏర్పాటు చేస్తే వాహన చోదకులు క్రమంగా రోడ్డు దాటే అవకాశం ఉంటుందని తద్వారా రోడ్డు ప్రమాదాలను కొంతమేర నివారించవచ్చని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మాదాసు భాను ప్రసాద్ అన్నారు.ఈ రోజు లోక్ సత్తా నాయకులు మాదాసు భాను ప్రసాద్, మురికిపూడి ప్రసాద్ పట్టణంలోని పలు ప్రాంతాలను పరిశీలించి రోడ్డు ప్రమాదాల నివారణకు కొన్ని సూచనలు చేశారు.పట్టణ పరిసర ప్రాంతాలలో లక్షకుపైగా ద్విచక్ర వాహనాలు, 40 వేలకు పైగా కార్లు ఉన్నాయని పట్టణంలో నిర్దేశించిన పార్కింగ్ స్థలం ఒకటైనా లేదని ఇప్పటికైనా నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలాలను గుర్తించి పార్కింగ్ ఏర్పాటు చేస్తే సౌకర్యంగా ఉంటుందని అన్నారు.పట్టణంలోని రిజిస్టర్ ఆఫీస్ ప్రక్కన ఉన్న పాత గవర్నమెంట్ హాస్పిటల్ స్థలం (25 సెంట్లు) నిరుపయోగంగా ఉందని ఆ స్థలాన్ని తాత్కాలికంగా పార్కింగ్ కోసం వినియోగిస్తే కొంత ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించ వచ్చు అన్నారు.ఈ కార్యక్రమంలో మురికిపూడి ప్రసాద్, డాక్టర్ కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.