క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశాన్ని కాపాడుకుందాం..సీపీఐ.
రైతు సంఘము.ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రత్నపల్లి గ్రామ శాఖ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలో రెండో సారి అధికారంలోకి వచ్చిన టువంటి నరేంద్రమోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మరో స్వతంత్ర పోరాటానికి సిద్ధం కావాలని ప్రజా, కార్మిక హక్కులను కాపాడుకోవాలని సీపీఐ వెల్దుర్తి మండల కార్యదర్శి టీ. కృష్ణ.అన్నారు. ఆగస్టు 9న క్విట్ ఇండియా ఉద్యమాన్ని జయప్రదం చేయాలని వాల్ పోస్టర్స్ విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రత్నపల్లె గ్రామ శాఖ కార్యదర్శి మద్దిలిటి. రైతు సంఘము నాయకులు జీ బాలు రాజు. డీ. రాజు. పులికొడ. శివ.గ్రామ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు…..ప్రజానేత్ర. న్యూస్.మౌలాలి