కల్వకుర్తి పట్టణాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్న మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం గారిని ఘనంగా సన్మానించిన రియాజ్. రవి
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్న కల్వకుర్తి చైర్మన్ ఎడ్మ సత్యం గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించిన నాయకుడు రియాజ్. రవి. టిఆర్ఎస్ కౌన్సిలర్ సైదులు గౌడ్. టిఆర్ఎస్ నాయకులు శ్రీధర్. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం మాట్లాడుతూ తనను సన్మానించిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కల్వకుర్తి లోని ప్రతి వార్డ్ అభివృద్ధే లక్ష్యంగా కల్వకుర్తి పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దే బాధ్యత గా ముందుకు వెళ్తున్నాం అని దీనికి కల్వకుర్తి ప్రజలు కూడా సహకరించాలని అలాగే ప్రతి ఒక్కరూ మాస్కు వాడాలని తమతమ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని ఆయన కోరారు