ఎన్ని చట్టాలు వచ్చినా మహిళల కు రక్షణేది

ప్యాపిలి మండలం చిగురు మాన్ క్రాస్ రోడ్డు దగ్గర బొజ్జి బాయ్ గ్రామంలో లక్ష్మన్న, ఆదిలక్ష్మి దంపతులు కూతురు జయసుధ తో నివాసముంటున్నారు. 3 నెలల కిందట వీరు గృహ ప్రవేశం చేశారు. వీరి పక్క ఇంట్లో శ్రీను, అమల దంపతులు నివసిస్తున్నారు. అయితే లక్ష్మన్న ఇంటి గృహప్రవేశం రోజున తమకు చెందిన బంగారం పోయిందని వీరిపై అనుమానిస్తూ, నింద వేస్తూ 2 నెలల తర్వాత శీను, అమల కుటుంబసభ్యులు వేధిస్తూ గొడవ చేస్తున్నారు. అయితే వివాదం పెద్దది అవుతుందని భావించిన లక్ష్మన్న, ఆదిలక్ష్మి దంపతులు స్థానిక జలదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఎస్సై వారి ఇరువురిని స్టేషన్ కు పిలిపించి మీరు గొడవ చేసుకోవద్దు, మేము విచారిస్తామని ఇరువురిని సర్ది చెప్పి పంపించారు. అయితే శనివారం సాయంత్రం లక్ష్మన్న లేని సమయంలో ఆదిలక్ష్మినీ ముందుగా శీను, విచక్షణా రహితంగా కొట్ట సాగాడు. ఆదిలక్ష్మి కూతురు జయసుధను ఇంట్లో పెట్టి తాళం వేశారు. అంతలోనే అతని భార్య కమల, అత్త అంజనమ్మ కుటుంబ సభ్యులు వచ్చి ఒక్కసారిగా మూకుమ్మడి దాడి చేశారు. దీనితో ఆదిలక్ష్మి స్పృహ తప్పి పడిపోయింది. బాధితురాలిని డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స చేయిస్తున్నారు. ఆదిలక్ష్మి కూతురు జయసుధ మాట్లాడుతూ నిర్భయ, దిశ ఎన్ని చట్టాలు వచ్చినా ప్రతిరోజు ఆడవారిపై దాడులు జరుగుతున్నాయన్నారు. మా అమ్మకు ఏదైనా జరగరానిది జరిగి ఉంటే మా పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు. దయచేసి అధికారులు తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
🎤 ప్రజా  నేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.