ఉగ్ర దాడిలో ఇద్దరు సైనికులు మృతి
వజిరిస్థాన్: పాకిస్థాన్ దేశంలో జరిగిన ఉగ్ర దాడిలో ఇద్దరు సైనికులు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు.ఖైబర్, దక్షిణ వజిరిస్థాన్ గిరిజన జిల్లాల్లో ఉగ్రవాదులు బాంబు దాడులకు పాల్పడ్డారు.ఖైబర్ జిల్లా తిరాహ్ లోయలో కొందరు గుర్తుతెలియని ఉగ్రవాదులు పాకిస్థాన్ ఫ్రంటియర్ కానిస్టేబుళ్లు లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపారు.ఈ ఘటనలో ఇద్దరు సైనికులు మరణించారు. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమై ఉగ్రవాదుల కోసం రాత్రంతా గాలించాయి.దక్షిణ వజిరిస్థాన్ జిల్లా లాధాలో పెట్రోలింగ్ పార్టీపై ఉగ్రవాదులు బాంబు విసిరారు.ఈ ఘటనలో ఓ కెప్టెన్ తో సహా ముగ్గురు సైనికులు గాయపడ్డారు.పేలుడుతో బాంబు దాడికి ఉపయోగిన మందుగుండు సామాగ్రి సైనిక వాహనంపై పడటంతో సైనికులకు గాయాలయ్యాయి.ఆప్ఘనిస్థాన్ సరిహద్దుల్లోని గిరిజన జిల్లాల్లో తాలిబన్ల ప్రాబల్యంతో తరచూ ఉగ్ర దాడులు జరుగుతున్నాయి.గత వారం జరిగిన ఉగ్రదాడిలోనూ ఇద్దరు సైనికులు మరణించగా, మరో 9మంది సైనికులు గాయపడ్డారు.