ఇన్సిడంటల్ కమాండర్ ఆదేశాల మేరకునేటి నుండి వింజమూరు లోలాక్ డౌన్

వింజమూరు,=కరోనా ఉదృతి నేపథ్యంలో వింజమూరు మండలం లో నేటి నుండి లాక్
డౌన్ విధిస్తున్నట్లు ఇన్సిడంటల్ కమాండర్ ఎం వి కె సుధాకర్ రావు తెలిపారు.వింజమూరు మండలం లో ఇప్పటికే 20 కరోనా కేసులు నమోదయ్యాయనిరోజురోజుకు కరోనా కేసులు జరుగుతున్నందున జిల్లా అధికారుల ఆదేశాలమేరకు లాక్ డౌన్ అందిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.జిల్లా వ్యాప్తంగా 3.7నిష్పత్తి ఉండగా వింజమూరు మండలం 4.7 గా ఉందని అందుచేత కఠిననిబంధనలు తప్పడం లేదన్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుండి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు లాక్ డౌన్ నిబంధనలు వర్తిస్తాయిఅన్నారు. మెడికల్ షాప్ లో పాలు మంచినీరు పెట్రోల్ బంకులు గ్యాస్ రేషన్
సరఫరా యధావిధిగా పని చేస్తాయన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపైపెనాల్టీలు వేయడంతోపాటు కేసులు నమోదు చేస్తామన్నారు. థర్డ్ ఉద్ధృతిపెరుగుతున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కరోన నిబంధనలుతప్పక పాటించాలని ఆయన తెలిపారు. సోమవారం కోవేడ్ మండల టీంఅత్యవసర సమావేశం నిర్వహించామని ఈ సమావేశంలో తీర్మానం మేరకుతప్పనిసరి పరిస్థితుల్లో లాక్ డౌన్ విధించగా తప్పడం లేదన్నారు. కనుకప్రజలు సహకరించాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.