ఆన్ లైన్ తరగతులు కొరకు పేద విద్యార్థులకు స్మార్ట్ ఫోన్ ల బహుకరణ అభినందనీయం : మున్సిపల్ చైర్మన్ రఫాని.

చిలకలూరిపేట:పేద విద్యార్థులు స్మార్ట్ ఫోన్ లేని కారణంగా ఆన్లైన్ తరగతులకు హాజరు కాలేక పోతున్నారని తెలుసుకుని వారికి ఫోన్ లు బహూకరించడం ఎంతో అభినందనీయమని మున్సిపల్ చైర్మన్ రఫాని అన్నారు. పట్టణంలోని నెహ్రూ నగర్ లో ఫెయిత్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ “ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న” అనే మదర్ థెరీసా సూక్తిని ఆచరణలో చూపిస్తూ పేద విద్యార్థులను ప్రోత్సహించడం హర్షణీయమని అన్నారు. ప్రభుత్వం నాడు, నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూల్స్ రూపురేఖలను మార్చి మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆంగ్ల మాధ్యమంలో విద్యను అందుబాటులోకి తెచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా ఫెయిత్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు పి. జర్మియా,పి. అనిల్ కుమార్ లను మున్సిపల్ చైర్మన్ అభినందించారు.
ఈ కార్యక్రమంలో కల్పతరువు చిట్స్ లంక ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ ఫెయిత్ సొసైటీ సేవలను కొనియాడారు. రోటరీ క్లబ్ ఆఫ్ పండరీపురం సభ్యులు అలంగార్ మోహన్ మాట్లాడుతూ నెహ్రూ నగర్ లో తమ వంతు సాయం అందిస్తామని అన్నారు. సొసైటీ కార్యదర్శి పి. అనిల్ కుమార్ మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా పేద విద్యార్థుల విద్య అభివృద్ధి కొరకు మరిన్ని కార్యక్రమాలు చేపడతామని అన్నారు.అనంతరం మున్సిపల్ చైర్మన్ చేతుల మీదుగా నలుగురు పేద విద్యార్థులకు స్మార్ట్ ఫోన్స్, జామెంట్రీ బాక్స్ లను పంచారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ చేతుల మీదగా చర్చ్ ప్రాంగణంలో మొక్కను నాటారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ విల్సన్, లోక్ సత్తా నాయకులు మాదాసు భాను ప్రసాద్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ వార్డెన్ రాజబాబు, ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు నూనె నాని, చెరుకూరి రవిచంద్ తదితరులు పాల్గొని ప్రసంగించారు..

Leave A Reply

Your email address will not be published.