అవయవదానం తో మరొక ప్రాణానికి వెలుగు…

-మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం.
-కల్వకుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ సైదులు…
-ప్రభుత్వ ఆసుపత్రి సుపర్డెంట్ రమేష్ చంద్ర..

ప్రపంచ అవయధాన దినోత్సవ సందర్భంగా కల్వకుర్తి పట్టణానికి చెందిన స్వామివివేకానంద సేవా బృందం ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో లో అవయవదాన అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతీయ వక్తలు హాజరయ్యి అవయవదానం పై అవగాహన కల్పించారు. ప్రభుత్వ ఆసుపత్రి సుపర్డెంట్ రమేష్ చంద్ర గారు మాట్లాడుతూ మనిషి బ్రతికి ఉండి, అలానే మరణించిన తర్వాత కూడా మరొక వ్యక్తి కి అవయవాలు దానం చేసి ప్రాణాలకు వెలుగునివ్వొచ్చని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం గారు మాట్లాడుతూ యువత అవయవదానం పై అవగాహన పెంచుకోవాలి అని,మరణించిన తర్వాత మట్టిలో కలిసే ఆ అవయవాలు వృధా కానివ్వరాదు అని మరొకరికి దానం చేసి ప్రాణ దాతలు కావాలని కోరారు. కల్వకుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ సైదులు గారు మాట్లాడుతూ నిత్యం ఎన్నో ప్రమాదపు కేసులను చూస్తున్నాము, ప్రమాదంలో ఎందరికో అవయవాలు అవసరం అందుకు దానం చెయ్యడానికి అవయవాల నిలువ చాలా తక్కువ ఉందని ప్రతి ఒక్కరం సమాజంలో సాటి మనిషికి,కుటుంబానికి ఆపదలో ఆదుకోవాల్సిన అవసరం ఉంది అందుకు ప్రతి ఒక్కరం అవయవాలు మరణాంతరం చెయ్యాలి అని కోరారు.కార్యక్రమంలో ఇటీవలే తన కాలేయాన్ని దానం చేసి ఒక ప్రాణాన్ని కపడినందుకు శివ కుమార్ కు ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రతి ఒక్కరం మరణాంతర అవయవాలు వృధా చేయబోమని సమాజంలో మరొక ప్రాణానికి ఉపోయోగపడేలా అవయవాలు దానం చేస్తాం అని ప్రతిజ్ఞ కార్యక్రమం చేపట్టారు.. కార్యక్రమంలో వైస్ చైర్మన్ షాహిద్,నాయకులు దుర్గా ప్రసాద్, సదానందం గౌడ్,కృష్ణ గౌడ్,రవి గౌడ్,రాఘవేందర్ గౌడ్, నర్సింహ,భోజి రెడ్డి, శ్రీకాంత్,స్కైలాబ్,ఎంపీటీసీ నర్సీ రెడ్డి,సేవా బృందం అధ్యక్షుడు శివ కుమార్,సభ్యులు ఉతేజ్,హరీష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.