అడవుల జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాము. ప్రభుత్వ విప్ భానుప్రసాద్ రావు.

జయశంకర్ భూపాలపల్లి 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ విప్ భానుప్రసాద్ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు.దేశ స్వాతం త్ర సాధన కోసం కృషిచేసిన మహాత్మా గాంధీ, సర్దార్ వల్లాభాయ్ పటేల్, జవహర్ లాల్, నెహ్రూ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లాంటి స్వాతంత్ర యోధులను స్మరిస్తూ, జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రగతిని ఈ సందర్భంగా మీ ముందుంచుతున్నానుతెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు మన జిల్లాలోనే మొదలవడం మనందరికీ గర్వకారణం. దీంతో పాటు జిల్లాలో బొగ్గులవాగు ప్రాజెక్టు, గణపసముద్రం, భీమ్ ఘన్పూర్ చెరువులు, మరియు 4 విడుతల మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా 132 కోట్ల రూపాయల వ్యయంతో 317 చెరువుల కింద అభివృద్ధి చేసిన 27 వేల 134 ఎకరాలకు సాగునీరు అందించబడుతుంది. చిన్న కాలేశ్వరం పనులు ప్రగతిలో ఉన్నాయి.
ఎల్లప్పుడూ రైతాంగం సంక్షేమాన్ని కోరుకునే ప్రభుత్వం 50 వేల లోపు పంట రుణాలు తీసుకున్న జిల్లాలోని 9558 మంది రైతులకు 29.55 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసింది. జిల్లాలో వానకాలం సీజన్లో 2 లక్షల 46 వేల ఎకరాలలో వివిధ రకాల పంటలను జిల్లాలోని రైతులు పండించనున్నారు. ఈ సంవత్సరం వానకాలం సీజనల్ లో 1 లక్షా 3813 మంది రైతులకు111.79 కోట్ల రూపాయలను రైతుబంధు పథకం ద్వారా అందించడమైంది.రైతు బీమా కార్యక్రమం ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 861 బాధిత రైతు కుటుంబాలకు 43.05 కోట్ల రూపాయల పరిహారం అందించడమైంది. జిల్లాలో 45 రైతు వేదికలకు గాను 43 నిర్మించడమైంది మిగతావి నిర్మాణ ప్రగతిలో కలవు, జిల్లాలో 1478 రైతు కల్లాల నిర్మాణానికి గాను 281 కల్లాల నిర్మాణం పూర్తయింది.936 నిర్మాణ పనులు ప్రగతిలో ఉన్నాయి. సీఎం గిరి వికాసం పథకం ద్వారా జిల్లాలో 9.5 కోట్ల రూపాయలతో 334 బోరుబావులు మంజూరు కాగా ఇప్పటివరకు 7.92 కోట్లు వ్యయం చేసి 160 బోరుబావులను ఏర్పాటు చేయడం జరిగింది. ఎరువుల పంపిణీలో అవకతవకలకు చోటు లేకుండా ఆధార్ అనుసంధానంతో వానకాలం సీజన్లో 17 వేల మెట్రిక్ టన్నుల యూరియా, 3406 మెట్రిక్ టన్నుల డీఏపీ, 4600 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులను సరఫరా చేయడం జరిగింది. రైతులను వ్యవసాయ రంగంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలైన పశుసంవర్ధకం, ఉద్యానవన పంటలు, చేపల పెంపకంలో రాయితీలు కల్పించి ప్రోత్సహించడం జరుగుతుంది.2020-2021 యాసంగి సీజన్లో జిల్లాలో 1లక్షా 35 వేల 535 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని 206 కొనుగోలు కేంద్రాల ద్వారా 26725 మంది రైతుల నుండి కొనుగోలు చేసి 255.84 కోట్ల రూపాయలను రైతులకు చెల్లించడమైంది. జిల్లాలో ఆహారభద్రత కార్డులు, అన్నపూర్ణ, అంత్యోదయ తదితర కార్డులు కలిగిన 1 లక్షా 24 వేల 352 కుటుంబాలకు ప్రతి నెల 277 చౌక ధరల దుకాణాల ద్వారా సన్న బియ్యం సరఫరా చేయడం జరుగుతుంది.మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా ఇంటింటికి నల్లాల ద్వారా తాగునీరు ఇచ్చే కార్యక్రమం వంద శాతం పూర్తయి జిల్లాలో గల 410 ఆవాసాల్లోని 1లక్షా 6712 ఇళ్లకు శుద్ధమైన త్రాగునీరు అందించబడుతుంది.ఈ ఆర్థిక సంవత్సరంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఇప్పటి వరకు 80845 మంది కూలీలకు 1లక్ష 65990 పనిదినాలను కల్పించి 31.45 కోట్ల రూపాయల కూలి డబ్బులు చెల్లించడం జరిగింది.స్వయం సహాయక మహిళా సంఘాలకు గ్రామీణ ప్రాంతాల్లో 920 సంఘాలకు 36.26 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీ రుణం, 2.41 కోట్ల రూపాయల స్త్రీనిధి రుణాలను, భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 41 గ్రూపులకు 1.67 కోట్ల రూపాయల రుణాలను అందించడమయింది.
జిల్లాలో గల దివ్యాంగులు, వయోవృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు తదితర రకాల 53159 మంది పింఛనుదారులకు ప్రతినెల 12.04 కోట్ల రూపాయల పింఛను అందించబడుతుంది.స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఈ ఆర్థిక సంవత్సరంలో 1510 మరుగుదొడ్లు మంజూరు కాగా ఇప్పటివరకు 922 మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయగా మరో 588 ఇది నిర్మాణాలు పురోగతిలో గలవు.కల్యాణలక్ష్మి కార్యక్రమం ద్వారా 9501 మంది లబ్ధిదారులకు 80 కోట్ల 82 లక్షల రూపాయలు, షాదీ ముబారక్ పథకం ద్వారా 362 మంది లబ్ధిదారులకు 2 కోట్ల 93 లక్షల రూపాయలు ఇప్పటివరకు జిల్లాలో అందించడమైంది.జిల్లాలో 469 ప్రభుత్వ,70 ప్రైవేటు పాఠశాలలో covid-19 కారణంగా ఆన్ లైన్ ద్వారా 45874 మంది విద్యార్థులకు విద్యాబోధన జరుగుతుంది. ఉపాధ్యాయుల యొక్క వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుటకు అన్ని సబ్జెక్టుల ఉపాధ్యాయులకు వెబినార్ (జూమ్ యాప్) ద్వారా శిక్షణ ఇవ్వడం జరిగింది. విద్యార్థులకు పంపిణీ చేసేందుకు 1 లక్ష 29230 పుస్తకాలు వచ్చాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుపేద విద్యార్థులకు ఫ్రీ మరియు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ ను అందించడం జరుగుతుంది.జిల్లాలో ఇప్పటివరకు 17 కోట్ల 92 లక్షల రూపాయలతో 1167 మంది ఎస్సీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి యూనిట్లను అందించడం జరిగింది. 2020-21 వార్షిక ప్రణాళిక కింద జిల్లాకు 11 కోట్ల 40 లక్షల రూపాయలు కేటాయించగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. 20 కోట్ల 44 లక్షల వ్యయం చేసి 154 మంది ఎస్సీ లబ్ధిదారులకు 410 ఎకరాల భూమిని పంపిణీ చేయడం జరిగింది. ఎస్సీ కాలనీలను సంపూర్ణంగా అభివృద్ధి పరిచేందుకు అధికారుల ద్వారా ఎస్సీ కాలనీలలో గల సౌకర్యాలపై సమగ్ర సర్వే నిర్వహించబడుతుంది.జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ వైద్య సేవలతో పాటు కరోనా నిర్ధారణ పరీక్షలు, వ్యాక్షిణేషన్ కార్యక్రమాలు సమర్థవంతంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు జిల్లాలో 2 లక్షల51 వేయి 357 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 15223 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా 14578 మందికి నయమైంది. ప్రస్తుతం 63 యాక్టివ్ కేసులు కలవు. జిల్లాలో 7 ప్రభుత్వ క్వరంటాయిన్ సెంటర్లలో 170 పడకల ద్వారా, 4 ప్రభుత్వ ఐసోలేషన్ కేంద్రాల ద్వారా 190 పడకలతో కరోనా వైద్య సేవలు అందించబడుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన జిల్లా ఆసుపత్రి భవనంలో మాతా,శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేసి ప్రసూతి సేవలతో పాటు తాత్కాలికంగా ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేసి కరోనా వైద్య సేవలు అందించబడుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటివరకు జిల్లాలో 1 లక్షా 67281 మందికి కరోనా టీకాలు వేయగా వారిలో 1లక్షా 28248 మందికి మొదటి డోసు, 39033 మందికి 2 రెండో డోసు వేయడం జరిగింది.ఇప్పటి వరకు 1961 మంది ఫ్రంట్ లైన్ వర్కర్లకు,3096 మంది హెల్త్ కేర్ వారియర్స్ కు ఉచిత టీకాలను పంపిణీ చేయడం జరిగింది. కెసిఆర్ కిట్ పథకం ద్వారా ఇప్పటివరకు 30 వేల 565 మంది లబ్ధిదారుల ఖాతాలో 8 కోట్ల 73 లక్షల రూపాయల నగదు జమ చేయడం జరిగింది.ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలైన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా జిల్లాలోని గ్రామాలు మరియు భూపాలపల్లి మున్సిపాలిటీలో పచ్చదనం, పరిశుభ్రత సంతరించుకుంటున్నాయి.భూపాలపల్లి మున్సిపాలిటీలో 58 కోట్లతో సిసి రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించగా ఇప్పటివరకు 49 కోట్ల రూపాయలు వ్యయం చేసి 553 పనులు పూర్తి చేయడం జరిగింది. 1 కోటి రూపాయలతో డంపింగ్ యార్డ్, 40 లక్షలతో ఎనిమిది ప్రాంతాలలో ఓపెన్ జిమ్ములు ఏర్పాటు చేయడం జరుగుతుంది. 3.50 కోట్ల రూపాయలతో షెగ్గెంపల్లి, కాసింపల్లి మరియు వేషాలపల్లిలలో వైకుంఠదామాల నిర్మాణం జరుగుతుంది.TUFIDC Phase-1 కింద 15 కోట్లతో పట్టణ అభివృద్ధి పనులు, మరియు 4.50 కోట్లతో సమీకృత మార్కెట్ నిర్మాణం మరియు 1 కోటి రూపాయలతో జంగేడులో వైకుంఠదామం నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది.1643 మంది వీధి విక్రయదారులకు 10 వేల రూపాయల చొప్పున 1.64 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేయడం జరిగింది.జిల్లాలో గల 241 గ్రామ పంచాయతీలలో వైకుంఠదామాలు, షెగ్రిగేషన్ షెడ్లు, 391 పల్లె ప్రకృతి వనాల నిర్మాణం చేపట్టగా ఇప్పటికీ 235 వైకుంఠదామాలు, 241 షెగ్రిగేషన్ షెడ్లు, 383 పల్లె ప్రకృతివనాల ఏర్పాటు పూర్తయినాయి.రూర్బన్ మిషన్ పథకం ద్వారా 15 కోట్ల రూపాయలతో భూపాలపల్లి మండలంలోని నాగారం క్లస్టర్ లో పట్టణ స్థాయి వసతుల కల్పనకు చర్యలు చేపట్టగా ఇప్పటి వరకు 4.40 కోట్లరూపాయలు వ్యయం చేసి 51 పనులు పూర్తి చేయడం జరిగింది. మరో 72 పనులు పురోగతిలో కలవు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం ద్వారా జిల్లాలో 3882 ఇండ్లు మంజూరు కాగా 153.30 కోట్ల రూపాయల వ్యయంతో పనులు చేపట్టగా ఇప్పటి వరకు 82.79 కోట్ల రూపాయలు వ్యయం చేసి 873 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడం జరిగింది.జిల్లాలో 589 మెయిన్ మరియు 55 మినీ అంగన్వాడీ కేంద్రాల ద్వారా 4446 మంది గర్భిణీ స్త్రీలు, బాలింతలకు పౌష్టికాహారం, 19వేల 80 మంది చిన్నారులకు బాలామృతంతో పాటు పూర్వ ప్రాథమిక విద్య అందించడం జరుగుతుంది. covid-19 దృష్ట్యా ఇంటికె పోషకాహారం పంపిణీ చేయడం జరుగుతుంది. ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం ద్వారా 289 మంది బాల కార్మికులను గుర్తించి పని నుండి విముక్తి కలిగించడం జరిగింది. సఖి కేంద్రం ద్వారా నిరాదరణకు మరియు దాడులకు గురైన 174 మంది మహిళల కేసులను నమోదు చేసి అవసరమైన సహాయ సహకారాలు అందించడం జరిగింది. మహిళా శక్తి కేంద్రం ద్వారా గ్రామీణ మహిళల సాధికారతకు చర్యలు చేపట్టడం జరిగింది.
రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు 18.75 కోట్ల రూపాయలతో జిల్లాలో విద్యుత్ సౌకర్యాలను మెరుగుపరచడమైంది. గుడుంబా స్థావరాలపై నిరంతర దాడులు చేయడం మరియు గుడుంబా కాయడం మరియు అమ్మకాలు మానేసిన వారికి రాయితీతో పునరావాసం కల్పించిన మూలంగా జిల్లాలో 98% గుడుంబా నియంత్రించబడింది. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ పిఎమ్ జిఎస్ వై పథకం ద్వారా 2.36 కోట్ల నిధులతో 3 పనులు ప్రారంభించడం జరిగింది.DMFT పథకం ద్వారా 105.05 కోట్ల రూపాయల అంచనాతో 442 పనులు చేపట్టగా నేటి వరకు 119 పనులు పూర్తి చేయడం జరిగింది
ఆర్ అండ్ బి శాఖ ద్వారా 262.64 కోట్ల రూపాయలతో 517 రహదారులు, భవనాలు మరియు బ్రిడ్జిల నిర్మాణం చేపట్టగా 157.86 కోట్ల రూపాయల వ్యయం చేసి వివిధ పనులు పూర్తి చేయడం జరిగింది.
తెలంగాణాకు హరితహారం కార్యక్రమం ద్వారా జిల్లాలో 27.29 లక్షల మొక్కలను నాటుటకు లక్ష్యంగా 241 నర్సరీలలో సిద్ధం చేసి ఇప్పటివరకు 81 శాతంతో 22.10 లక్షల మొక్కలను నాటడం జరిగింది. ఈ సంవత్సరం అవెన్యూ ప్లాంటేషన్ మరియు ఇంటింటికి ఆరు మొక్కలను అందించుట ముఖ్య ఉద్దేశంగా హరితహారం కార్యక్రమం అమలు చేయడం జరిగింది.జీవన జ్యోతి బీమా యోజన, సురక్ష బీమా యోజన, అటల్ బీమా యోజన తదితర సామాజిక భద్రత పథకాలు, ముద్రాలోన్స్, స్ట్రీట్ వెండర్స్ పథకాలు, బ్యాంకు అకౌంట్లకు ఆధార్ సీడింగ్ సమర్థవంతంగా నిర్వహించి జిల్లాలోని పేద ప్రజల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడినందుకు గాను 2021 మార్చి నెలలో నీతి అయోగ్ ప్రకటించిన ర్యాంకింగ్ లలో ఆర్థిక స్వావలంబన విభాగంలో దేశంలోనే మొదటి స్థానంలో జిల్లా నిలిచిందని తెలుపుటకు సంతోషిస్తున్నాను. అదేవిధంగా మిగతా అన్ని రంగాలలో కూడా విశేష ప్రతిభ కనబరిచి ఓవరాల్ గా దేశ స్థాయిలో జిల్లా 4వ స్థానంలో నిలిచింది.తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతాంగానికి సత్వర భూసేవలను అందించుటకు ధరణి పోర్టల్ ను ప్రారంభించింది. వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు సబ్ రిజిస్టర్ ఆఫీస్ లకు వెళ్లే అవసరం లేకుండా తహశీల్దార్లకు అధికారం బదలాయించింది. రిజిస్ట్రేషన్ తో పాటుగా వెంటనే పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ధరణి లాగిన్ ద్వారా రిజిస్ట్రేషన్లు, నాలా, పెండింగ్ పట్టా మార్పులు మరియు పార్టిషన్ మొత్తం 2 లక్షల 24639 దరఖాస్తులు స్వీకరించగా అందులో 1 లక్ష 29 వేల 85 ఎకరాలకు పట్టా పాస్ పుస్తకాలను ఇవ్వడం జరిగింది.75 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో తమ అభివృద్ధి గురించి గత పాలకులు అవలంబించిన విధానాల ద్వారా దళితుల్లో ఎటువంటి పురోగతి రాలేదని నమ్మకం ఏర్పడింది. వారిలో గూడుకట్టుకున్న అవిశ్వాసాన్ని తొలగిపోయేలా ప్రభుత్వాలు తమ అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నాయనే విశ్వాసాన్ని బలమైన నమ్మకాన్ని దళితుల్లో కలిగించాల్సిన ఉద్దేశ్యంతో తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నాని సాధించిన అనుభవం, కాలేశ్వరం, మిషన్ భగీరథ, రైతుబంధు, రైతుబీమా మొదలైన అద్భుతమైన పథకాల సృష్టికర్తగా షెడ్యూల్డ్ కులాలకు చెందిన గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, షెడ్యూల్ కులాల మేధావులతో కూలంకషంగా చర్చించి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు దేశంలో ఎక్కడా లేనివిధంగా దళితుల అభ్యున్నతి కోసం కొత్తగా దళిత బందు పథకాన్ని ఈ సంవత్సరం బడ్జెట్లో ప్రకటించారు. సంతృప్త స్థాయిలో తెలంగాణలోని పేద కుటుంబాలకు చెందిన దళితులందరూ అభ్యున్నతి ఆర్థిక సాధికారత సాధించేలా ఈ పథకం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంకురార్పణ చేశారు. ప్రతి కుటుంబం వారి ఆసక్తి, అనుభవం, నైపుణ్యం ఆధారంగా స్వయం ఉపాధి పథకాలను ఎంపిక చేసుకునే సౌలభ్యం ప్రభుత్వం కల్పించింది. ఈ పథకం కింద పేద దళిత కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం సాయం చేయనుంది. మరణం లేదా తీవ్రమైన ప్రమాదం ఏమైనా అనుకోని కారణాలవల్ల లబ్ధిదారుని కుటుంబం పేదరికంలోకి జారిపోకుండా ఉండేలా ఈ పథకంలో భాగంగా రక్షణ నిధి ఏర్పాటు చేసింది. ఈ పథకం విజయవంతం కావాలంటే ప్రణాళిక మరియు అమలు ప్రక్రియలో సమాజం యొక్క భాగస్వామ్యం తప్పనిసరి అని భావించి గ్రామ, మండలం, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో దళిత బంధు కమిటీలను ఏర్పాటు చేయనుంది. తెలంగాణ మాత్రమే కాకుండా దేశ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఎస్సీ వర్గాలను సమాజంలో ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి సంతృప్తస్థాయిలో అర్హులైన పేద దళిత కుటుంబాల అందరికీ ఆర్థిక సహాయం అందించేందుకు చేపడుతున్న ఈ పథకం కాళేశ్వరం, మిషన్ భగీరథ, రైతుబంధు, రైతుబీమా మాదిరే దళితబందు యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచి దేశానికి సరికొత్త దశ,దిశలను నిర్దేశించనుంది.జిల్లాలో పర్యాటకులను ఆకర్షించే కోటగుళ్ళు, కాలేశ్వరం వద్ద కోట్ల రూపాయలతో హరిత హోటల్ నిర్మించడం జరిగింది. ఆయా ప్రదేశాలతో పాటు పాండవులగుట్ట, మైలారం గుహలు, ఎకో టూరిజం ప్రాంతాలైన బొగ్గులవాగు తదితర ప్రకృతిసిద్ధ సుందర ప్రదేశాలను ప్రభుత్వo మరియు ప్రజాప్రతినిధుల సహకారంతో అభివృద్ధి చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక కృషి చేస్తుందని తెలియజేస్తూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.