పెళ్లికి ఒప్పుకోలేదని యువజంట ఆత్మహత్య

నెల్లూరు: ఇంట్లో పెద్దలు ప్రేమ పెళ్లికి అంగీకరించడం లేదని ప్రేమికులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ గూడూరు పట్టణంలో చోటు చేసుకున్నది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

రెండవ పట్టణ వీధి అర్బన్ హెల్త్ సెంటర్ సమీపంలో అమ్మాయి ఇంట్లో ప్రేమికులు ఆత్మహత్యాయత్నం చేశారు. వెంకటేష్, తేజస్విని కొద్ది నెలలుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు పెళ్లి చేసుకుంటానమని చెప్పగా, పెద్దలు అంగీకారం తెలపలేదు. ఇక కలిసి జీవించలేమని నిర్థారించుకున్న ఇద్దరూ ఇంట్లో ఉరేసుకున్నారు. ఉరేసుకుంటున్నది చూసిన ఇరుగు పొరుగువారి వారిని కిందికి దించి ఆసుపత్రికి తరలించారు. తేజస్విని మృతి చెందగా, వెంకటేష్ మృత్యువుతో పోరాడుతున్నారు. గూడూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం పంపించారు.

Leave A Reply

Your email address will not be published.