పద్మ అవార్డులకు మీరే జడ్జీలు: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: పద్మ అవార్డుల కోసం వ్యక్తులను నామినేట్ చేసే అధికారాన్ని ప్రజలకు కల్పిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో సమాజం కోసం, దేశం కోసం పనిచేసేవాళ్లు ఎందరో ఉన్నా వారి ప్రతిభను కొన్ని సందర్భాల్లో గుర్తించలేకపోతున్నారు.
ఇలాంటి వారిని ప్రోత్సహించి గౌరవించేందుకు పద్మ అవార్డుగ్రహీతలను నామినేట్ చేసే అవకాశం ప్రజలకు కల్పించారు.

సమాజంలో ఎంతో మంది పనిచేస్తున్నా అలాంటి వ్యక్తులను చూడం. వారి గురించి కూడా వినం. అలాంటి వ్యక్తులు మీకు తెలుసా? వాళ్లను మీరు నామినేట్ చేయాలి అని ప్రధాని ట్వీట్ చేశారు. సెప్టెంబర్ 15 వరకు పేర్ల ను నామినేట్ చేయవచ్చన్నారు. పద్మా అవార్డ్స్ వెబ్ సైట్ లోకి వెళ్లి మీకు తెలిసిన వ్యక్తుల పేర్లను నామినేట్ చేయవచ్చని మోదీ తెలిపారు. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ, సేవ చేసిన వారికి పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ప్రకటిస్తుంది.

Leave A Reply

Your email address will not be published.