వైఎస్ఆర్ ను తిడితే ఊరుకోం: ఎమ్మెల్యే రోజా

తిరుమల: మాజీ ముఖ్యమంత్రి, చనిపోయిన వ్యక్తి వైఎస్.రాజశేఖర రెడ్డిని తెలంగాణ మంత్రులు నోటికొచ్చినట్లు తిడితే మర్యాద ఉండదని వైసిపి ఎమ్మెల్యే ఆర్.కె.రోజా హెచ్చరించారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకం, జూరాల ప్రాజెక్టు అక్రమ వినియోగంపై తెలంగాణ మంత్రులు నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ లు ఏపి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. వైఎస్ఆర్ ను నరరూప రాక్షసుడుగా అభివర్ణించారు.

ఈ వ్యాఖ్యలపై ఇవాళ ఉదయం తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న రోజా మీడియాతో మాట్లాడారు. కృష్ణా జలాలను అక్రమంగా వాడుకుంటూ తెలంగాణ రాష్ట్రం ఏపికి అన్యాయం చేస్తుందన్నారు. ఏపికి అన్యాయం జరిగితే తాము సహించేది లేదని ఆమె స్పష్టం చేశారు. తమ వాటాను కేటాయించాలని కేంద్రానికి సిఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారన్నారు. కేటాయింపులకు వ్యతిరేకంగా తెలంగాణ జల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుందని ఆమె ఆరోపించారు. మహిళల కోసం జగన్ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలోని విధంగా పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దొంగ దీక్షలను ఎవరూ నమ్మరని రోజా కొట్టిపారేశారు.

Leave A Reply

Your email address will not be published.