వ్యాక్సిన్ మిక్సింగ్ డేంజర్: డబ్ల్యూహెచ్ఓ

జెనీవా: కరోనా వ్యాక్సిన్ మిక్సింగ్ చేయడం అత్యంత ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుందని, సురక్షితం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. ఎవరికి నచ్చిన విధంగా వారు మిక్సింగ్ చేసుకోవద్దని స్పష్టం చేసింది.
ప్రభుత్వ ఆరోగ్య సంస్థలు సూచించిన విధంగా కరోనా వ్యాక్సిన్లు వేయించుకోవాలని డబ్ల్యూహెచ్ఓ స్సష్టం చేసింది.

తొలి డోసు ఏ కంపెనీ తీసుకున్నారో, రెండో డోసు కూడా అదే కంపెనీ తీసుకోవాలని సూచించింది. అయితే వ్యాక్సిన్లను మిక్సింగ్ చేయడం వల్ల కాని, మ్యాచింగ్ చేయడం వల్ల కలిగే పరిణామాలపై ఎటువంటి డేటా సేకరించలేదని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటింగ్ సౌమ్య స్వామినాథన్ వివరించారు. వీటిపై అధ్యయనాలు జరుగుతున్నాయని, త్వరలోనే డేటా అందుబాటులోకి వస్తుందని అన్నారు. మిక్సింగ్ పై ప్రజలు తమకు నచ్చిన నిర్ణయాలు తీసుకుంటే పరిస్థితి దిగజారుతుందని, మూడు, నాలుగు డోసులు కూడా తీసుకోవాలనే ఆలోచన కూడా సరికాదని సౌమ్య స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.